NewsOrbit
న్యూస్

ఆనంద్ ఎంట్రీ మాములుగా లేదుగా… కష్టాలకే కేరాఫ్ అడ్రెస్ లాగా ఉన్నాడుగా..!!

Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే.. స్వప్న కోపంగా సౌందర్య ఇంటికి వచ్చి ఏదేదో మాట్లాడుతుంది. మంచి మర్యాద అని నాకు తెలుసు.ఎలా మాట్లాడాలి… ఏం చేయాలి అని మీ ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటుంది స్వప్న. ఇక ఆనందరావు మాత్రం మీ ఆవిడ అంటావేంటి స్వప్న తను మాత్రం మీ అమ్మ కాదా అంటాడు. ఇంతలో స్వప్న డాడీ నాకు మమ్మీ లేదు నాకు మిగిలింది మీరు ఒక్కరే అంటుంది. ఎప్పుడైతే నా కూతురిని అనరాని మాటలు అందో అప్పుడే నాకు మమ్మీ లేదు అని డిసైడ్ అయిపోయాను. లేని బంధాలు బంధుత్వాలు కలుపుకోవాలని చూడొద్దని మీ ఆవిడ గారికి చెప్పండి డాడీ.. ఏంటి స్వప్న నువ్వు నేను బంధుత్వాలు కలుపుకోవాలని చూడటం ఏంటి అంటుంది సౌందర్య..

Karthika Deepam : నా కొడుకుతో నీ మనవరాలి పెళ్లి ఎప్పటికి జరగదు అని చెప్పిన స్వప్న :

డాడీ మీ ఇద్దరి మనవరాళ్ల ను అని.. ఛీ ఛీ ఉంది ఒకటే కదా.. మీ మనవరాల్ని నా కొడుకు లో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా అంటుంది స్వప్న. ఎప్పుడైయితే నా పేగు తెంచుకుని పుట్టిన నా కూతుర్ని అంత మాట అందో అప్పుడే మమ్మీకి నాకు బంధం తెగిపోయింది.ఆ పెళ్లి మాత్రం ఈ జన్మకు జరగదని చెప్పండి డాడీ అంటుంది స్వప్న.సీన్ కట్ చేస్తే సౌర్య క్యారేజ్ తీసుకుని సత్య వాళ్ళ ఇంటికి వస్తుంది. సార్ మీరు ఏదైనా అనుకోండి సార్ ఉన్నది ఉన్నట్లు మొహం మీద చెప్పటం అలవాటు..ఏమి జరిగింది అని. సత్య అంటే ఇప్పటికే ఎక్సట్రా మీకు జరిగింది అంతా చెప్పే ఉంటాడు కదా సార్ అంటుంది సౌర్య.

Karthika Deepam : స్వప్నను భరించడం చాలా కష్టం అన్నా సౌర్య మాటలకు సత్య స్పందన ఏంటి..?

ఏంటి సార్ ఆవిడా ఒక మూడు నిముషాల పాటు కూడా ఆమెను భరించలేకపోయాను అంటుంది. నాకు అర్థం అయింది సర్ మీరు ఎందుకు ఆవిడకి దూరంగా ఉంటున్నారు అని అసలు ఆవిడ ఏంటి అంత రఫ్ గా మాట్లాడుతున్నారు అంటుంది. సౌర్య మాటలకు సత్య కొందర్ని మనం ఏమి చేయలేము జ్వాలా అయితే బాధపడాలి లేదంటే వాళ్ళకి దూరంగా వెళ్లిపోవాలి అంటాడు. నేను చేసింది కూడా ఇదే అమ్మా అంటాడు సత్య. వామ్మో మీరేమో సాఫ్ట్ ఆవిడేమో ఫాస్ట్ గా ఉంటుంది. ఆవిడ నన్ను కొట్టింది సార్ వేరే ఎవరన్నా అయితే నేనేంటో చెప్పేదాన్ని అంటుంది. ఇక సత్య మాత్రం గుడి దగ్గర స్వప్న ప్రవర్తనకు నా తరుపున సారీ అంటాడు. అయ్యో మీరెందుకు సారీ చెబుతున్నారు సార్ వద్దు అంటుంది జ్వాల.

బాధలో హిమ.. ఓదార్చిన నానమ్మ,తాతయ్యలు…. ఇంతలో నిరూపమ్

ఇక హిమ మాత్రం అత్త అన్నా మాటలు తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. సౌందర్య, ఆనందరావు వచ్చి హిమను ఓదార్చుతారు. అంతలోనే నిరూపమ్ వస్తాడు. సౌందర్య నిరూపమ్ ను చూసి రేయ్ మీ అమ్మా అని అనగానే మమ్మీ ఇక్కడికి వచ్చి ఏదో గొడవ చేసి ఉంటుందిలే అని అర్ధం అయిందిలే అమ్మమ్మ అంటాడు నిరూపమ్. ఇక హిమ బాధపడుతూ ఉంటే ఆమెను ఓదార్చుతాడు నిరూపమ్.. సీన్ కట్ చేస్తే సౌర్య బస్తిలో ఉన్న మోనిత ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న ఆమెతో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోమన్నా తెలుసుకున్నావా అంటే లేదు అంటుంది.

పాపం ఆనంద్ పరిస్థితి ఏంటి ఇంత దారుణం

ఇక సౌర్య మనసులో ఆనంద్ ను మోనిత అంటీ ఎక్కడికి తీసుకుని వెళ్లి ఉంటుంది అనుకుంటుంది. సీన్ కట్ చేస్తే ఒక అబ్బాయి మోనిత రాసిన బుక్ చూస్తూ నా కార్తీక్ అని అమ్మ రాసింది అంటే తానే మా నాన్న అయి ఉంటాడు అనుకుంటాడు. పక్కన గోడ మీద మోనిత, కార్తీక్ లు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో చూపిస్తారు. ఇంతలో ఎవరో ఒకావిడ వచ్చి అన్నం తినమంటే ఈరోజు ఏమి కూర వండావు పెద్దమ్మ అంటాడు. మటన్,చికెన్ తేవడానికి నువ్వేమి మహారాజు జాతకుడివి కావురా దరిద్రపు జాతకుడివి అంటుంది.నోరు మూసుకుని పెట్టింది తిను అంటుంది కోపంగా. ఎందుకు పెద్దమ్మ నేనంటే అంత కోపం అని ఆనంద్ అంటే నీ మొహం చూస్తుంటే నీ దరిద్రం నాకు అంటుకునేలాగా ఉంది అంటుంది. ఎందుకు ఎప్పుడు చుసిన తిడతావు అంటాడు ఆనంద్.. పెద్దమ్మ మా అమ్మా నాన్నలు పేర్లు ఏంటి అని అడగగా నాకు తెలియదు వాళ్ళ గురించి కానీ మీ అమ్మా నాన్నలు డాక్టర్స్ అని మాత్రమే నాకు తెలుసు అంటుంది పెద్దావిడ.అందుకేనా నాకు డాక్టర్ అవ్వాలని అనిపిస్తుంది అనుకుంటాడు.

ఆస్థి కోసం అరుణ, లక్షణ్ లను చంపేసిన బంధువులు

పెద్దమ్మ నాకు అక్కా, చెల్లి ఎవరో ఉండే ఉంటారు కదా చెప్పు వాళ్ళ గురించి అంటే నాకు తెలియదు. మీ అమ్మా నా చెల్లి అరుణకి తన ఆస్తులు ఇచ్చి ఏటో వెళ్ళిపోయిందట.ఆ ఆస్థి కోసమే మా చెల్లి అరుణను, తన భర్త లక్షణ్ ను చంపేశారు. నీ దరిద్రపు జాతకం వలన నా చెల్లి నేను పోగొట్టుకున్నాను రా అని ఆనంద్ ను తిడుతుంది. దిక్కు దివానా లేకుండా నువ్వు ఒక్కడివే మిగిలి పోయావు నీ ఇల్లు ఎక్కడుందో నీ ఆస్తి ఎక్కడ ఉందో అనే విషయాలు ఆ దేవుడికే తెలియాలి అంటుంది. నా చెల్లి అరుణ చనిపోతూ చివరిక్షణంలో నిన్ను నాకు అంటగట్టి వెళ్ళింది రా. నువ్వు నా ప్రాణానికి దాపరించావురా అంటూ ఆనంద్ ను తిడుతుంది.అదే సీన్‌లో పాపం ఆనంద్.. కార్తీక్, మోనితల ఫొటోలు చూసి ‘అమ్మా.. నాన్నా.. మీరు డాక్టర్లా..’ అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు.

నాన్నమ్మ ఇంటికి వెళ్లనున్న సౌర్య

మరోవైపు సౌర్య రోడ్డు పక్కనే నిలబడి ఉన్న ఓ పెద్దామె ముందు ఆటో అపి ఆమెను ఎక్కించుకుంటుంది.ఏంటి పెద్దమ్మా.. ఈ వయసులో ఏంటీ కష్టం?’ అంటూ మాట కలుపుతుంది జ్వాల ఆటో నడుపుతూ.. ‘ఏం చెప్పాలమ్మా.. ఉన్న ఒక్క మనవడు చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయాడు.. బతకడానికి ఒక ఇంట్లో పనికి కుదిరానమ్మా. తలకొరువు పెట్టడానికైనా నా మనవడు వస్తాడో రాడో.. చూస్తానో లేదో’ అంటూ బాధపడుతుంది.ఇంట్లో నుంచి వెళ్తే పెద్దవాళ్ళు ఇంత బాధ పడతారా.. నా కోసం కూడా మా నాన్నమ్మ వాళ్ళు బాధ పడతారా.. అయినా వాళ్ళు నాకోసం అసలు వెతకడమే లేదు కదా నేనెందుకు వాళ్ల గురించి బాధపడాలి అనుకుంటుంది సౌర్య.

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju