Kitchen : మన ఆరోగ్యం ఆధారపడిన ప్రదేశం కిచెన్ గా చెప్పుకోవచ్చు. కిచెన్ ,వాడే పత్రాలు ఎంత శుభ్రం గా ఉంటే మన ఆరోగ్యం అంత బావుంటుంది. ప్రతి రోజు చిన్న చిన్న చిట్కాలు పాటించడం వలన కిచెన్ ఎప్పుడు శుభ్రం గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కిచెన్ పరిశుభ్రంగాఉండడానికి ఇలా చేసిచూడండి.
కిచెన్లో ఒలికిపోయిన ఆహారపదార్థాలను తుడిచేందుకు పేపర్ బదులు పాత కాటన్ వస్త్రం లేదా స్పాంజ్ నివాడాలి.ఆ స్పాంజ్ కూడా ఎప్పటికప్పుడు వేడినీటిలో డిష్ వాష్ లిక్విడ్ వేసి స్పాంజ్ శుభ్రం గా ఉండేలా చూసుకోవాలి.
కిచెన్ టవల్ నుకూడా వాడకాన్ని బట్టి రెండు రోజులకు ఒకసారి అయినా వాష్ చేసినవి మారుస్తూ ఉండాలి .పప్పులు, ఇతర దినుసులు కొనేందుకుషాప్ కి వెళ్లినప్పుడు క్లాత్బ్యాగ్ వెంట తీసుకువెళ్తే ఇంటిలో ప్లాస్టిక్ కవర్ల నిల్వ తగ్గడం తో పాటు వాటి వాడకం కూడా తగ్గుతుంది..
వంట కోసం ఉపయోగించే కూరల వేస్ట్,పళ్ళ తొక్కలను కంపోస్ట్ గా మార్చుకుని ఇంటి గార్డెన్ లో పెంచుకునే మొక్కలు కి వేస్తె చాలా బలం పెరుగుతాయి. మిగిలిపోయిన కూరగాయ ముక్కలు, పండ్ల తొక్కలు, గుడ్డు పెంకులతో సేంద్రియ ఎరువులు సిద్ధం చేసుకుని వాడడం మంచిది.ఇలా కిచెన్ లో వెస్ట్ ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేసుకోవాలి. అప్పుడు దోమలు ,ఈగలు ,బొద్దింకలు, రావు ఇంట్లో చెడు వాసన కూడా ఉండదు. వంట పూర్తి అయినా ప్రతి సారి స్టవ్ ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
స్టవ్ వెనుక జిడ్డు మరకలు పట్టకుండా ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేసుకోవాలి. ఆయిల్ ,ఉప్పు ,కారం పప్పులు డబ్బాలు తీసి వాడుతున్నప్పుడు ఒకసారి తుడిచి పెట్టుకుంటే ఎప్పుడూ శుభ్రంగా కనిపిస్తాయి. గిన్నెలో నిల్వ పదార్థాలు ఉండకుండా ఎప్పటికప్పుడు కడిగి శుభ్రం చేసుకోవాలి. మంచి నీళ్ల బాటిల్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మిక్సీ ,గ్రైండర్ వాడిన వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఎక్కడైనా నూనె,మజ్జిగ వంటివి ఒలికినప్పుడు బియ్యపు పిండి వేసి కొంచెం సేపు అయ్యాక శుభ్రం చేసుకుంటే జిడ్డు తేలికగా వదిలిపోతుంది.సింకు లో అంట్లు ఎప్పటికప్పుడు తోమి పక్కన పెట్టుకోవాలి తప్ప అలా వదిలేయకూడదు..