ట్రెండింగ్ న్యూస్

Kushi Kushiga : ఖుషీ ఖుషీగా గ్రాండ్ ఫినాలే ప్రోమో వచ్చేసింది

kushi kushiga grand finale promo
Share

Kushi Kushiga : ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీ షో గురించి తెలుసు కదా. తెలుగులో మొదటి సారి వచ్చిన స్టాండప్ కామెడీ షో ఇది. ఇదివరకు తెలుగులో చాలా కామెడీ షోలు వచ్చినా కూడా నిలదొక్కుకోలేకపోయాయి. కానీ.. మెగా బ్రదర్ నాగబాబు తన సొంత యూట్యూబ్ చానెల్ లో ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీ షోను ప్రారంభించారు. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. త్వరలో గ్రాండ్ ఫినాలే కూడా జరగనుంది.

kushi kushiga grand finale promo
kushi kushiga grand finale promo

గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ప్రోమోను కూడా తాజాగా విడుదల చేశారు. ఫస్ట్ సీజన్ త్వరలోనే ముగుస్తుండటంతో.. గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ గా నాగబాబు కూతురు నిహారిక వచ్చారు.

Kushi Kushiga : గ్రాండ్ ఫినాలేలోనూ సూపర్ గా నవ్వించిన కంటెస్టెంట్లు

గ్రాండ్ ఫినాలేకు సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లు అందరినీ సూపర్ గా నవ్వించారు. అయితే.. గ్రాండ్ ఫినాలేకు కంటెస్టెంట్లకు నచ్చిన కాన్సెప్ట్ కాకుండా…. వాళ్లకు ఒక టాపిక్ ఇచ్చి… ఆ టాపిక్ మీద మాట్లాడమంటారు. ఎవరైతే ఆ టాపిక్ మీద నవ్విస్తూ మాట్లాడుతారో… వాళ్లను విజేతగా ప్రకటిస్తారు.

అలాగే… గెస్ట్ గా వచ్చిన నిహారిక… కంటెస్టెంట్లు మాట్లాడుతుండగా మధ్యలో కొన్ని పదాలు చెబుతుంది. వాటికి అనుగుణంగా కంటెస్టెంట్లు నవ్వించాల్సి ఉంటుంది.

సరికొత్త కాన్సెప్ట్ తో గ్రాండ్ ఫినాలేను అదరగొట్టేలా ప్లాన్ చేసింది ఖుషీ ఖుషీగా టీమ్. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి మరి.


Share

Related posts

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

Mahesh

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

యుకేని వణికిస్తున్న కొత్త రకం కరోనా వైరస్..! అప్రమత్తమైన భారత ఆరోగ్యశాఖ..!!

somaraju sharma