బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో ఈ వారం చివరి నామినేషన్స్ జరగబోతున్నాయి. ఇవాళ అంటే సోమవారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో చివరి నామినేషన్స్ ప్రక్రియ జరగబోతోంది. బిగ్ బాస్ 4వ సీజన్ లో ఇదే చివరి నామినేషన్స్ అంటూ బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశారు.
ప్రస్తుతం హౌస్ లో ఉన్నది ఆరుగురు ఇంటి సభ్యులు. ఆరుగురిలో అఖిల్ ఇప్పటికే ఫైనలిస్టు అయ్యాడు. అంటే అఖిల్ ను నామినేట్ చేసే అధికారం ఇంటి సభ్యులకు లేదు. ఇక మిగిలింది అభిజీత్, సోహెల్, అరియానా, మోనల్, హారిక. ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది.
అయితే.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి.. ఈ వారం అఖిల్ తప్పించి.. మిగితా ఇంటి సభ్యులంతా నామినేట్ అయ్యారట. అంటే ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారన్నమాట. ఆదివారం వేసిన ప్రోమో ప్రకారం.. సోహెల్ కు ఏదో కిరీటం దొరికింది కాబట్టి.. సోహెల్.. నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు.. అంటూ వార్తలు వస్తున్నప్పటికీ.. సోహెల్ నామినేషన్స్ నుంచి సేవ్ కాలేదు.. అందరూ ఈసారి నామినేషన్స్ లోకి వచ్చారంటూ వార్తలు వస్తున్నాయి.
మొత్తం మీద ఈ వారం చివరి నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరిగిందో తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. చూద్దాం మరి.. హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ ఎంతో వేడిని సృష్టించిందో?