NewsOrbit
న్యూస్

పాన్ కార్డు పోయిందా ? ఆందోళ‌న చెంద‌కండి.. డూప్లికేట్ పాన్ కార్డును ఇలా పొందండి..!

ఇన్‌క‌మ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అందించే ప‌ర్మినెంట్ అకౌంట్ నంబ‌ర్ (పాన్‌) కార్డు తీసుకోవ‌డం ప్ర‌స్తుతం అత్యంత ఆవ‌శ్య‌కం అయింది. ఆర్థిక లావాదేవీల కోస‌మే కాదు, ప‌లు ఇత‌ర అవ‌స‌రాల కోసం కూడా పాన్‌ను అడుగుతున్నారు. అందువ‌ల్ల ఈ కార్డును పొందడం త‌ప్ప‌నిస‌రి అయింది. అయితే పాన్ కార్డును పోగొట్టుకున్న‌వారు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. డూప్లికేట్ పాన్ కార్డును పొంద‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే…

lost your pan card know how to get it

పాన్ కార్డును పోగొట్టుకున్న వారు మ‌ళ్లీ ఆ కార్డును పొంద‌వ‌చ్చు. అది చాలా సుల‌భ‌త‌రమైన ప్ర‌క్రియే. కాక‌పోతే ముందుగా పాన్ కార్డు పోయిందంటూ పోలీస్ స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాలి. అనంత‌రం ఎఫ్ఐఆర్ కాపీతో కొత్త పాన్ కార్డును తీసుకోవ‌చ్చు. అందుకు గాను ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఇండియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో రిక్వెస్ట్ ఫ‌ర్ న్యూ పాన్ కార్డ్ లేదా కరెక్ష‌న్ ఇన్ పాన్ కార్డ్ డేటా అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. త‌రువాత అందులో వివ‌రాల‌ను నింపి కొత్త పాన్ కార్డును పొంద‌వ‌చ్చు. ఇందుకు గాను రూ.110 + 18 శాతం జీఎస్టీ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

అయితే పాన్ కార్డు పోయిన వారు ఆ నంబ‌ర్ గుర్తు లేక‌పోతే ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఇండియా వెబ్‌సైట్‌లో నో యువ‌ర్ పాన్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అందులో అడిగిన విధంగా వివ‌రాల‌ను న‌మోదు చేస్తే పాన్ కార్డునంబ‌ర్‌ను చెబుతారు. దీంతో ఆ నంబ‌ర్‌ను ఉప‌యోగించి కొత్త కార్డును తీసుకోవ‌చ్చు. ఇక కొత్త‌గా పాన్ కు అప్లై చేసే వారు ఇ-పాన్ కార్డును కూడా సుల‌భంగా తీసుకోవ‌చ్చు. అందుకు గాను ఆధార్ ఉంటే స‌రిపోతుంది. ఇన్‌క‌మ్‌ట్యాక్స్ ఇండియా సైట్‌లో ఇన్‌స్టంట్ ఇ-పాన్‌కు అప్లై చేసి అందులో ఆధార్ నంబ‌ర్ న‌మోదు చేస్తే ఓటీపీ వ‌స్తుంది. దాన్ని క‌న్‌ఫాం చేశాక త‌క్ష‌ణ‌మే ఇ-పాన్ జ‌న‌రేట్ అవుతుంది. దీనికి ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన ప‌నిలేదు. అలా తీసుకున్న ఇ- పాన్ కార్డును ఇ-మెయిల్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ కూడా చేస్తారు. దాంతో ఆర్థిక లావాదేవీలు కొన‌సాగించ‌వ‌చ్చు.

author avatar
Srikanth A

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N