ట్రెండింగ్ న్యూస్ సినిమా

Saranga Dariya : యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో లవ్ స్టోరీ సారంగ దరియా సాంగ్

Saranga Dariya: Sai Pallavi crazy record
Share

Saranga Dariya : సారంగ దరియా Saranga Dariya సాంగ్ వినే ఉంటారు. అదేనండి.. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమాలోని ఈ సాంగ్ తాజాగా యూట్యూబ్ లో విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

Love story saranga dariya trending on youtube
Love story saranga dariya trending on youtube

తెలంగాణ జానపద గేయం సారంగ దరియాకు సరికొత్త మెరుగులు దిద్ది.. లవ్ స్టోరీ సినిమాలో వాడుకున్నారు. మొత్తానికి ఇదివరకు కంటే కూడా.. ఇప్పుడు ఈ పాట ఇంకా అద్భుతంగా వచ్చింది. మంగ్లీ పాటను పాడటం.. పాటకు సరైన ట్యూన్స్ ను ఇవ్వడం, దానికి తగ్గట్టుగా సాయి పల్లవి డ్యాన్స్.. అదిరిపోయింది.

ఈ పాటను వింటుంటే.. ఫిదా సినిమాలోని వచ్చిండే.. మెల్లామెల్లగ వచ్చిండే అనే పాట గుర్తుకొస్తుంది. శేఖర్ కమ్ముల సినిమాలు అంటేనే.. ఇలా పల్లెటూరు వాసన ఉంటుంది. అచ్చమైన తెలుగు దనం ఉట్టిపడేలా ఆయన సినిమాలు ఉంటాయి. దానికి ఉదాహరణే ఫిదా. ఇప్పుడు మళ్లీ అదే కాన్సెప్ట్ తో లవ్ స్టోరీ అనే సినిమాను చేస్తున్నాడు శేఖర్.

ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటిస్తోంది. తాజాగా తెలంగాణ జానపద గేయం సారంగ దరియాను మార్చి ఈ సినిమాలో ఉపయోగించుకున్నారు.

Saranga Dariya : యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్న సారంగ దరియా సాంగ్

అయితే.. ఈ సినిమాలోని సారంగ దరియా పాట.. యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇదివరకే ఈ పాటను విన్నప్పటికీ.. రేలా రె రేలా ప్రోగ్రామ్ లో, తెలంగాణ పల్లెల్లో ఈ పాట ఎప్పుడూ మారుమోగుతూనే ఉన్నప్పటికీ.. మరోసారి ఈ పట అద్భుతంగా వచ్చింది. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

మీరు ఇప్పటి వరకు ఈ పాటను వినకపోతే ఇప్పుడు వినండి. అద్భుతంగా ఉంటుంది.

 


Share

Related posts

హైపర్ ఆది చేసిన పనికి కుమిలిపోతున్న దుర్గారావు..!!

sekhar

Raviteja : రవితేజ సినిమాలో జాయిన్ అయిన దివ్యాన్ష కౌశిక్

GRK

Justice NV Ramana: పార్లమెంట్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

somaraju sharma