న్యూస్

Madya Pradesh: కాల్పుల్లో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించిన మధ్యప్రదేశ్ సీఎం

Share

Madya Pradesh: దుండగుల దాడిలో మృతి చెందిన ముగ్గురు పోలీసు కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మద్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుదైన జాతికి చెందిన నాలుగు జింకలను కొందరు దుండగులు వేటాడినట్లు అందిన సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతంలోకి వెళ్లగా దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారని ఎస్పీ రాజీవ్ మిశ్రా తెలిపారు. ఈ కాల్పుల్లో ఎస్ఐ రాజ్ కుమార్ జాదవ్, ఇద్దరు కానిస్టేబుళ్లు నీలేశ్ భార్గవ, శాంతారామ్ మీనాలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఘటన స్థలంలో రెండు జింక కళేబరాలు, అయిదు కళేబరాలు, ఒక నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Madya Pradesh cm announced ex gratia police victim families
Madya Pradesh cm announced ex gratia police victim families

ఈ ఘటనపై వెంటనే స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ తన నివాసంలో ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం జరిగింది. హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా,, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సహా పలువురు బేటీ అయ్యారు. ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు కోటి రూపాయల వంతున పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం ప్రకటించారు. వారిని అమర వీరులుగా గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. ఘటనా స్థలానికి ఆలస్యంగా వెళ్లిన ఐజీని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు బలగాలను ఆ పంపించామనీ, నిందితులు తప్పించుకునే ప్రసక్తి లేదని సీఎం చెప్పారు.


Share

Related posts

Actress Ileana Latest Stills

Gallery Desk

Sarkaru vaari paata : ‘సర్కార్ వారి పాట’ టీజర్‌తో అంచనాలు పెంచబోతున్న థమన్..ఇందులో మహేష్ ఎలా కనిపించనున్నాడంటే..!

GRK

Today Horoscope జనవరి -18- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar