బిగ్ బాస్ 4 సీజన్ అయితే ముగిసింది కానీ.. బిగ్ బాస్ 4 హడావుడి మాత్రం ఇంకా ముగిసిపోలేదు. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు సోషల్ మీడియాలోనే కాదు.. అక్కడా ఇక్కడా అంతటా తెగ హడావుడి చేస్తున్నారు. టీవీలకు, యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. ఫుల్లు బిజీ అయిపోయారు వాళ్లు. వాళ్ల జీవితంలో కూడా ఏనాడూ ఇంత బిజీ అవుతామని ఊహించి ఉండరు.

ఇప్పటికే బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్.. మెగా హీరో నాగబాబును కలిశారు. మరికొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా నాగబాబును కలిశారు. అయితే.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు అందరికీ మెగా హీరో నాగబాబు మెగాపార్టీ ఇచ్చారు.
అందరినీ స్టార్ హోటల్ కు పిలిచి పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు అందరూ వచ్చారు. అందరూ బిగ్ బాస్ హౌస్ లో తమ మెమోరీస్ ను గుర్తు చేసుకున్నారు. అయితే.. పార్టీలో కొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయితే మిస్ అయ్యారు. బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ కూడా పార్టీలో కనిపించలేదు. అఖిల్, సోహెల్, మెహబూబ్, లాస్య, హారిక, అరియానా, నోయల్, అవినాష్ అయితే పార్టీలో కనిపించారు.
ఈసందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అన్నిరోజులు అక్కడ ఉండి రావడం అంటే మాటలు కాదని.. బిగ్ బాస్ హౌస్ లో ఉండి రావడం అనేదే పెద్ద సక్సెస్ అని.. ఇప్పటి నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరికీ మంచి అవకాశాలు రావాలని ఆయన కోరుకున్నారు.
మెగా పార్టీకి సంబంధించిన వీడియోను నాగబాబు తన యూట్యూబ్ చానెల్ లో విడుదల చేశారు.