NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Nandamuri Balakrishna – Mansoor: బాలయ్యపై దుమారం కొనసాగుతుండగానే వివాదంలో చిక్కుకున్న మన్సూర్ .. చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు

Nandamuri Balakrishna – Mansoor: ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై కోలీవుడ్ కు చెందిన సీనియర్ నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు ఒక వైపు చిత్ర పరిశ్రమలో, మరో పక్క రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం మరువకముందే కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ .. నటి త్రిష గురించి చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. త్రిషపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనని మన్సూర్ ఆలీఖాన్ అనడంతో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మన్సూర్ పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నై లోని థౌజండ్ లైట్స్ పోలీసులు మన్సూర్ కు సమన్సు జారీ చేశారు. గురువారం తమ విచారణకు హజరు కావాలని ఆదేశించారు.

అయితే ఈ రెండు ఎప్పుడో జరిగిన ఘటనలను ఇప్పుడు ప్రస్తావించడం వివాదాలకు కారణమైయ్యాయి. ఇటీవల తమిళ బిగ్ బాస్ సీజన్ సెవెన్ షో లో సీనియర్ నటి విచిత్ర ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడుతూ 2001 లో భలేవాడివి బాసు సినిమా షూటింగ్ సమయంలో హీరోతో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లుగా చెప్పడం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, సినీ ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతున్నాయి. బాలయ్య గతంలో మహిళలను ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా నటి విచిత్ర తాను గతంలో ఎదుర్కొన్న సమస్యను ఇప్పుడు వివరించడంతో అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో బాలయ్య వ్యతిరేకులకు మంచి స్టఫ్ వచ్చినట్లు అయ్యింది. ఈ వివాదం నేపథ్యంలో అంతర్జాతీయ ఓటీటీ సంస్థలు బాలయ్య సినిమాలను బాయ్ కాట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతోంది.

ఈ వ్యవహరం ఇదిలా ఉండగా, మన్సూర్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్రిషతో ఓ సన్నివేశంలో యాక్ట్ చేయడంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు. కేరీర్ ఆరంభం నుండి ఇప్పటి వరకూ తాను ఎన్నో రేప్ సీన్స్ లో నటించాననీ, లియోలో ఆఫర్ వచ్చిన సమయంలో త్రిషతోనూ అలాంటి సీన్ చేసే అవకాశం ఉందనుకున్నానని అలా లేకపోవడం తనను ఎంతో బాధించిందని అన్నారు. మన్సూర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుష్పూ .. సినిమాలో పోషించిన పాత్రలనే నిజ జీవితంలోనూ మన్సూర్ ఫాలో అవుతున్నట్లు ఉన్నారని, ఆయనను చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తొందని వ్యాఖ్యానించారు. ఇద్దరు నటుల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.

Rahul Gandhi: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు – రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చిన ఈసీ

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Janhvi Kapoor: టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్..ఈసారి అల్లు అర్జున్ తో ఛాన్స్ అందుకున్న జాన్వీ కపూర్..!!

sekhar

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu