NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: నందు నిజస్వరూపం బయటపెట్టిన తులసి.. అవమానంతో నందు ఏం చేశాడు.!?

Intinti Gruhalakshmi: మాధవికి ప్రేమ్ ఫోన్ చేసి అత్తయ్య నీకు ఒక గుడ్ న్యూస్.. తాతయ్య నానమ్మలు ఎక్కడ ఉన్నారో తెలిసింది.. మదర్ తెరిసా వృద్ధాశ్రమంలో వాళ్ళు ఉన్నారు‌. ఈ విషయం అమ్మకు చెప్పు కానీ.. నేను నీకు ఈ విషయం చెప్పానని అమ్మకు ఈ విషయం తెలియనివ్వకు అని చెబుతాడు. ఈ విషయం నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా ప్రేమ్.. నేను చూసుకుంటాను అని అంటుంది. వదినా అమ్మానాన్నలు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది అని మాధవి పెద్దగా అరిచి చెబుతుంది..!

Intinti Gruhalakshmi: Serial 1 Apirl 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 1 Apirl 2022 Today Episode Highlights

తులసి వృద్ధాశ్రమానికి పరుగుపరుగున వెళుతుంది. మావయ్య నేను మీ విషయంలో తప్పు చేశాను. మీరు వెళ్ళను అని నాతో చెప్పి ఉండాల్సింది. నేను చేసిన తప్పుకి నీ కాళ్ళమీద పడి క్షమించమని అడుగుతున్నాను. దయచేసి మీరు నాతో రండి మావయ్య. మీరు నాతో రాకపోతే నేను కూడా ఇక్కడే మీరు వచ్చే వరకు దీక్ష చేస్తాను అని చెబుతుంది తులసి. మేము వస్తే నువ్వు నందు తో మమ్మల్ని పంపించేస్తారు అని వాళ్ళ మావయ్య అనడంతో.. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను మావయ్య.. అలా నేను ఎప్పటికీ చేయను అని మీకు మాట ఇస్తున్నాను. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చి వదిలి పెడతాను అని చెబుతుంది. దాంతో పరంధామయ్య వెంట రావడానికి ఒప్పుకుంటాడు.

 

పరంధామయ్య అనసూయ మళ్ళీ ఇంటికి రాగానే నందు మళ్లీ తులసిపై గొడవకి దిగుతాడు. తులసి ససేమిరా అత్తయ్య మామయ్య వాళ్ళు మీతో పంపించను అని చెబుతుంది. మా అమ్మానాన్నల్ని నాకు కాకుండా చేస్తున్నావు. నా విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు తెలిసి కచ్చితంగా నువ్వు అనుభవిస్తావు అని నందు అనడంతో తులసి కి కోపం వచ్చి మీరు నా విషయంలో చాలాసార్లు చాలా విధాలుగా నన్ను నమ్మించి మోసం చేశారు మిమ్మల్ని నమ్మి మీ జీవితంలోకి నేను వస్తే.. మీరు పరాయి స్త్రీతో జీవితం పంచుకున్నారు అని అంటుంది. ఇంతకంటే నాకు పెద్ద శిక్ష ఇంకా ఏమి ఉంటుంది లే అని తులసి అంటుండగా గా నేను నిన్ను వదిలేసి అని నువ్వు కావాలని నా మీద పగ తీర్చుకుంటున్న అని అంటాడు నందు.. మిస్టర్ నందగోపాల్ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ మీరు నన్ను వదిలేయ లేదు.. నేనే మిమ్మల్ని వదిలించుకొన్నాను.. మీ ప్రవర్తన.. మీ పద్ధతి నచ్చక నేను మిమ్మల్ని వదిలేసాను అని అంటుంది. భార్యగా నువ్వు ఒక పెద్ద ఫెయిల్యూర్ అందుకే నేను నిన్ను వదిలేసాను అని నందు అంటాడు. పాతిక సంవత్సరాలు మీరు ఏం చేసినా నేను చూస్తూ మౌనంగా ఉండిపోయాను. అది నా ఫెయిల్యూర్..

 

భర్తగా మీరు అతి పెద్ద ఫెయిల్యూర్.. అని తులసి నందు పై విరుచుకు పడుతుంది.. దాంతో నందు కూడా హద్దులు దాటి మాట్లాడతాడు. మగ తోడు లేని ఆడదానికి ఈ లోకం ఇచ్చే విలువ ఏమిటో నేను గడప దాటి వెళ్ళిన తర్వాత నీకు తెలిసి వస్తుంది.. మగ తోడు లేకుండా కూడా ఆడది బ్రతకగలదండి.. నీ ఆత్మవిశ్వాసం నిన్ను ఎక్కడ బోర్లా పడేలా చేస్తుందో నేను చూస్తాను కదా.. అంటూ నందు లాస్య తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. అంతలో ఎలాంటి ఊహించని ట్విస్ట్ జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu