NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ అంత ఏం ఇవ్వలేదు: కుమార్ సాయి!

బిగ్‌బాస్ తాజా సీజ‌న్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇప్ప‌టికే బిగ్‌బాస్ హౌస్ నుంచి ప‌లువురు ప్ర‌ముఖ కంటెస్టంట్లు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వ‌చ్చిన అనంత‌రం బిగ్‌బాస్ గురించి సంచ‌లన వ్యాఖ్య‌లు సైతం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 3 గురించి ఈ రోజుల్లో సినిమా ఫేమ్‌, న‌టుడు కుమార్ సాయి ప‌‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బిగ్‌బాస్ నిర్వాహ‌కులు త‌న‌కు ఎక్కువేం ఇవ్వ‌లేదంటూ కామెంట్ చేశాడు.

త‌న‌కున్న ప్రత్యేక క్రేజ్ తో బిగ్‌బాస్ హౌస్‌లో నటుడు కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టారు. ఈ క్ర‌మంలోనే ఇత‌ర కంటెస్టంట్ల‌తో మంచి అనుబంధం కొన‌సాగిస్తూనే… సేప్ గేమ్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ ఇది త‌న‌కు క‌లిసి రాక‌పోవ‌డంతో బిగ్‌బాస్ హౌస్‌లో అంద‌రికి దూర‌మయ్యాడు. ఈ నేప‌థ్యంలోనే నామినేట్ అయి.. బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అయితే, బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న మిగ‌తా కంటెస్టెంట్ల‌తో పాటు నిర్వాహ‌కులు సైతం ఆయ‌న‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి.. బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే విధంగా చేశార‌ని సోష‌ల్ మీడియాలో తీవ్ర స్థాయిలోనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కుమార్ సాయి తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట‌లు గ‌మ‌నిస్తే.. బిగ్‌బాస్ నిర్వ‌హ‌ణ కోసం ఈ సారి త‌క్కువ బ‌డ్జెట్‌ను కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన సీజ‌న్‌ల‌లో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న వారిని కంటెస్టంట్లుగా తీసుకునే వారు. ఈ సారి మాత్రం అలా చేయ‌లేదు. అయితే ఈ విధంగా నిర్వాహ‌కులు ఆలోచించ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. ఎందుకంటే క‌రోనా కారణంగా కంటెస్టంట్ల‌తో సంబంధం లేకుండా బిగ్ బాస్ సీజ‌న్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని అనుకు న్నట్టుగా తెలుస్తోంది.

ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసే విధంగా కుమార్ సాయి తాజా ఇంట‌ర్వ్యూ కొన‌సాగింది. కుమార్ సాయి ఓ ఇంట‌ర్వ్యూ ప్ర‌కారం.. త‌న‌ను టార్గెట్ చేసి మ‌రి బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే విధంగా ఇత‌ర కంటెస్టంట్లు న‌డుచుకున్నార‌ని చెప్పారు. నిర్వాహ‌కులు సైతం త‌న వల్ల పెద్ద‌గా ఎంటర్టైన్మెంట్ లేద‌ని భావించే బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు పంపించార‌ని రూమ‌ర్లు వ‌చ్చిన సంగ‌తి త‌న‌కు తెలిసింద‌ని అన్నారు. కుమార్ సాయి త‌న రెమ్యూన‌రేష‌న్ గురించి మాట్లాడుతూ.. త‌న‌కు ల‌క్ష‌లు లక్ష‌లు ఏమి ఇవ్వ‌లేద‌నీ, రెగ్యుల‌ర్ గా తాను సినిమాల్లో న‌టిస్తే ఇచ్చేంత‌నే ఇచ్చార‌ని వెల్ల‌డించాడు. అంటే ప్ర‌స్తుతం కుమార్ సాయి యాక్ట‌ర్‌గా డైలీ రూ. 10 వేల వ‌ర‌కూ అందుకుంటున్నారు. ఈ లెక్క‌న చూస్తే.. బిగ్‌బాస్ కార‌ణంగా కుమార్ సాయి పెద్ద‌గా మ‌నీ పొందింది ఏమి లేద‌ని తెలుస్తోంది.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri