కొంచెం బొద్దుగా, ముద్దుగుమ్మలా ఉండే కీర్తి సురేశ్ జీరో సైజ్ కి మారడం మూలంగా ఆమెకు కొన్ని సినిమాలు దక్కే చాన్స్ లేదని ఫ్యాన్స్ అనుకుంటారు. ఇలా ఆమె ఉన్నపలంగా జీరో సైజ్ లోకి రావడం మూలంగా ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారనే చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. నేను శైలజ, నేను లోకల్, రెమో, తనకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన సినిమా మహానటి వంటి ఎన్నో సినిమాల్లో నటించారు ఈ అందగత్తె.
అన్ని సినిమాల్లోనూ ఈ భామ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. కొంచెం బొద్దుగా ఉన్నా ముద్దుగా ఉందంటూ ఆమెకు కామెంట్లు వచ్చాయి. కాని నేడు ఆమె జీరో సైజ్ చూస్తే ఎవరూ నమ్మలేనట్టుగా మారిపోయింది. దీనికి తోడు మహానటి తర్వాత ఆమెకు సినిమాలు కలిసిరావడం లేదని నెటిజన్లు అనుకుంటున్నారు. ఆ సినిమా తర్వాత ఆమె కథలను ఎంపిక చేసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని కామెంట్లు కూడా వస్తున్నాయి. రీసెంట్ గా ఆమె తీసిన లేడి ఓరియెంటెడ్ మూవీలు అనుకున్న విధంగా ఆడకపోవడం వల్ల ఆమెపై ఆసక్తి తగ్గించేశారు ఆడియెన్స్. తాజాగా రిలీజైన పెంగ్విన్ మూవీని భారీ రేంజ్ లో ఊహించుకున్నారు.
కాని ఆ మూవీ అనుకోని విధంగా అపజయాన్ని చవిచూసింది. ఇదిలా ఉంటే మిస్ ఇండియాతో కీర్తి పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఆ మూవీలో ఆమె నటన, జీరో సైజ్ కు రావడం పట్ల ఆమె అభిమానులు, ప్రజలు చాలా ఫీలవుతున్నారు. మరీ ముఖ్యంగా అంత సన్నగా మారడం ఎవరికీ నచ్చడం లేదు. దాంతో ఆమె మిస్ ఇండియా సినిమా కోసమే సన్నబడ్డానని చెప్పుకొచ్చింది. కాని అందులో సన్నబడటానికి కారణమే లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీని కారణంగా ఆమెకు కొన్ని సినిమాల్లో చాన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే కీర్తి సురేశ్ కు మహేశ్ బాబు సరసన నటించే అవకాశం వచ్చింది. సర్కారి వారి పాటలో కీర్తిని హీరోయిన్ గా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా కీర్తికి తాజాగా అన్ని ప్లాఫ్ లే రావడం తో ఈ సినిమా కూడా అలాగే అవుతుందేమోనని మహేశ్ బాబు ఫ్యాన్స్ బయపడతున్నట్టు తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి. మరీ జీరో సైజ్ కు మారిని కీర్తీకి మహేశ్ బాబు పక్కన నటించే చాన్స్ ఉంటుందా.. ఊడుతుందా అనేది ప్రశ్నే.. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ బొద్దుగా మరి ఫ్యాన్స్ ను మెప్పిస్తోందో లేదా అనేది..
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!