ట్రెండింగ్ న్యూస్

వ్యాక్సిన్ వచ్చింది అని సంతోషించేలోపే చావు కబురు..! ఈ కొత్త కరోనా దేనికీ లొంగదట..!

Share

కరోనా వ్యాక్సిన్ మొదలైనప్పటికీ క్రమక్రమంగా పెరుగుతున్న కొత్త స్టైన్లు శాస్త్రవేత్తలకు తలనొప్పులు తెస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే కరోనా 10 రకాలుగా రూపాంతరం చెందింది. రాబోయే రోజుల్లో ఇది మరెన్ని తలనొప్పులు ఇస్తుందో తెలియదు. మొన్నామధ్య బ్రిటన్ తో పాటు ఆఫ్రికా దేశాలలో కూడా పలు రకాలుగా గుర్తించారు. 

 

తాజాగా బ్రెజిల్లో కూడా మరొక కొత్తరూపం వైరస్ బయటపడింది. ప్రస్తుతం కనుగొన్న వ్యాక్సిన్లు దీనిపై పనిచేయడం అనుమానమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక గత నెలలోనే ఈ కొత్త స్టైన్ ను సైంటిస్టులు గుర్తించారు. అయితే అది ఇప్పటికే పది రకాలుగా రూపాంతరం చెందింది అని చెప్పారు. వైద్య నిపుణులు మాత్రం ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు కొత్తరకం లొంగుతుంది అని నమ్మకం లేదు అని అనడం గమనార్హం. వెంటనే మన శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. 

బ్రెజిల్ లో బయటపడిన వైరస్కు జన్యు మార్పులు జరిగినట్లు సైంటిస్టులు తేల్చారు. దానికి ముందు బయటపడిన కొత్తరకం స్టైన్ లతో పోల్చుకుంటే ఇది మరింత బలంగా ఉందని చెబుతున్నారు. అయితే మనదేశంలో ఈ స్టైన్ కు సంబంధించిన కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. జపాన్ లో మాత్రం బ్రెజిల్ స్టైన్ కేసులు వెలుగు చూశాయి అని చెబుతున్నారు. 

గతంలో కోవిడ్ బారిన పడిన వాళ్ళకి కూడా ఇది సోకే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.ఇక డబ్ల్యూహెచ్వో వారు మాత్రం వైరస్ వ్యాప్తికి మనుషుల ప్రవర్తన కూడా కారణమని చెబుతున్నారు. భౌతిక దూరం పాటించడం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం వంటి చర్యలను నిర్లక్ష్యం చేయరాదని… ఇప్పుడు కూడా తప్పనిసరిగా పాటించాల్సిందే అని సూచించారు.


Share

Related posts

భారత్ కు మరో 7500 కోట్ల ప్రపంచ బ్యాంకు సాయం

somaraju sharma

Breaking: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం ..ఒకే కుటుంబానికి చెందిన అయిదురు మృతి

somaraju sharma

Crow: కాకి కి అన్నం పెట్టడం వలన  జరిగేది ఇదే !!

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar