ట్రెండింగ్ న్యూస్

బుల్లితెర మీద మరో క్రేజీ జంట.. సుధీర్, రష్మీని మించిపోయారు?

new pair in extra jabardasth immanual and varsha
Share

బుల్లితెర అంటేనే గుర్తొచ్చేది సుధీర్, రష్మీ జంట. అవును.. ఆ జంటకు ఉన్న క్రేజ్ మామూల్ది కాదు. వాళ్లు ఏ షోకు వెళ్తే ఆ షో హిట్టే. వాళ్ల రొమాన్స్, డ్యూయెట్లు ఎంత ఫేమస్సో చెప్పక్కర్లేదు. గత ఎనిమిదేళ్ల నుంచి ఆ జంటకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది తప్పితే తగ్గడం లేదు.

new pair in extra jabardasth immanual and varsha
new pair in extra jabardasth immanual and varsha

వాళ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీని చూసి వాళ్లిద్దరూ లవ్ లో ఉన్నారని అంతా అనుకుంటారు. జబర్దస్త్ స్కిట్ లలో అప్పుడప్పుడు రష్మీని సుధీర్ గోకుతుండటం, ప్రపోజ్ చేస్తుండటం, సుధీర్ ఏం అన్నా కూడా రష్మీ కేవలం ఓ చిరునవ్వు నవ్వుతుంది తప్పితే ఏం అనకపోవడం వల్ల.. ఇద్దరి మధ్య ఏదో ఉంది అని అంతా అనుకున్నారు. కానీ.. వాళ్లిద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అని చాలాసార్లు ఇద్దరూ జబర్దస్త్ స్టేజీ మీదే ఒప్పుకున్నారు.

ఏది ఏమైనా.. సుధీర్, రష్మీ జంటకు ఉన్న క్రేజ్ అంతే. అది తగ్గదు. అయితే.. తాజాగా బుల్లితెర మీద మరో జంట సందడి చేస్తోంది. అదే జబర్దస్త్ నుంచి వచ్చిన జంటే అది. ఆ జంట కూడా ప్రస్తుతం బుల్లితెర మీద హాట్ టాపిక్ గా మారింది.

ఆ జంటే.. ఇమ్మాన్యుయేల్, వర్ష. ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం జబర్దస్త్ లో నిలదొక్కుకుంటున్నాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. ఇక వర్ష కూడా అంతే. తను ఓ మోడల్, నటి. పలు సీరియళ్లలోనూ నటించింది. తాజాగా జబర్దస్త్ లో వరుసగా స్కిట్లు చేస్తోంది. ఎక్కువ స్కిట్లు ఇమ్మాన్యుయేల్ తోనే చేయడం అది కూడా ఎక్కువ రొమాంటిక్ స్కిట్లు చేస్తుండటంతో ఈ జంటకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది.

తాజాగా.. విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలోనూ వీళ్లిద్దరితో స్కిట్ ఉంది. ఇద్దరూ కలిసి మరోసారి రొమాన్స్ ను పండించారు. స్కిట్ ముగిశాక.. ఏంటి సంగతి… ఇదంతా కేవలం స్కిట్ కోసమేనా… లేక.. మరేమైనా ఉందా? అంటూ రోజా అడిగేసరికి… ఇద్దరూ తెగ సిగ్గుపడిపోయారు.

వర్ష అయితే.. తను జస్ట్ ఫ్రెండ్ అని చెబుతోంది కానీ.. ఇద్దరి వాలకం చూస్తుంటే ఏదో ఉంది అనే అనిపిస్తోంది అని అంటున్నారు నెటిజన్లు. చూద్దాం.. అసలు వాళ్ల మధ్య ఏదైనా ఉందా? లేక వాళ్లు కూడా కేవలం సుధీర్, రష్మీ లాగానా? మొత్తానికి ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో అయితే ప్రస్తుతానికి చూసేయండి..


Share

Related posts

పవన్ కళ్యాణ్ గురించి మాట దాటేసావేం కీరవాణి?

sowmya

ఓటీటీలో రిలీజైన ఆకాశం నీ హద్దురా .. సూర్య పొరపాటు చేశాడంటున్నారు …?

GRK

Today Gold Rate: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!!

bharani jella