Scheme: భారతదేశంలో చాలామంది రిస్క్ లేకుండా పథకాలలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తూ ఉంటారు ఎంతోమంది ప్రజలు.. ముఖ్యంగా ఇది డబ్బున్న వాళ్ళ నుంచి సామాన్య ప్రజల వరకు వర్తిస్తుంది. అందుకే పోస్ట్ ఆఫీస్ పథకం అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన పథకాలను మీ ముందుకు తీసుకొచ్చింది. ఇకపోతే దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజల కోసం పోస్ట్ ఆఫీస్ అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే పోస్ట్ ఆఫీస్ గ్రామీణ పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీం కింద గ్రామ సుమంగల్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింగ్ గురించి సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.

కేవలం భారతదేశంలోని గ్రామీణ జనాభా కోసం మాత్రమే రూపొందించబడింది. ఈ పథకంలో కేవలం ప్రతిరోజు 95 రూపాయలను పెట్టుబడిగా పెట్టడం వల్ల.. రూ.14 లక్షల ఫ్యాట్ డిపాజిట్ పొందవచ్చు. గ్రామ సుమంగల్ గ్రామీణ పోస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది పోస్ట్ ఆఫీస్ మనీ బ్యాక్ ప్లాన్.. మరి ఈ పాలసీ గురించి ఇప్పుడు చూద్దాం. ఇది మనీ బ్యాక్ పాలసీ కాబట్టి ఎప్పటికప్పుడు రిటర్న్లు పొందవచ్చు. ఈ పథకం యొక్క ప్రయోజనం ఏమిటంటే పెట్టుబడిదారులు మరణ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. నామినీకి హామీ మొత్తాన్ని ఇచ్చే ప్రయోజనం కూడా ఈ పథకం ద్వారా లభిస్తుంది.
19 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్న ఎవరైనా ఇందులో చేరవచ్చు. ఇందులో 15 లేదా 20 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 15 సంవత్సరాలకు పాలసీని కొనుగోలు చేస్తే మీరు ఆరు సంవత్సరాలు, 9 సంవత్సరాలు ,12 సంవత్సరాల పాలసీలో 20% డబ్బును తిరిగి పొందుతారు. మిగిలిన 40 శాతం మెచ్యూరిటీ తర్వాత అందుకుంటారు. మరో వైపు 20 సంవత్సరాలకు పాలసీ తీసుకుంటే.. ఎనిమిదవ సంవత్సరం, 12వ సంవత్సరం, 16వ సంవత్సరంలో తిరిగి 20% డబ్బు పతకం మెచ్యూరిటీ అయిన తర్వాత మిగిలిన 40% మొత్తాన్ని 20వ సంవత్సరంలో పొందుతారు.