బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కమలాపురం పోలీసులు నోటీసులు జారీ చేశారు. టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ ఇటీవల పోలీసులు అరెస్టు చేయగా, ఆయనకు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ తీసుకుని విచారణకు హజరు కావాలంటూ కమాలాపూర్ పోలీసులు బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆయన ఫైర్ అయ్యారు.

పోలీసుల నోటీసులపై బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. ఎంపి గా ఉన్న తనపై నిరాధార ఆరోపణలు సరికాదని పేర్కొన్నారు. తన ఫోన్ పోయిందని ఇప్పటికే పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన సెల్ ఫోన్ ట్రేస్ చేసి ఇవ్వాలని కోరారు. తన ఫోన్ దొరికే వరకూ విచారణకు పిలవ వద్దని బండి విజ్ఞప్తి చేశారు. సంబంధం లేని కేసులో తనకు పదే పదే నోటీసులు ఇస్తే న్యాయ పరంగా ప్రొసీడ్ అవుతానని సంజయ్ పేర్కొన్నారు.
బండి సంజయ్ హైకోర్టు లో దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ విచారణ జరిగింది. రిమాండ్ ను సవాల్ చేస్తూ బండి సంజయ్ ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ లో దాఖలు చేశారు. సంజయ్ బెయిల్ రద్దు చేయాలని ఏజీ హైకోర్టును కోరారు. విచారణకు బండి సంజయ్ సహకరించలేదని హైకోర్టు కు ఏజీ తెలిపారు. బండి సంజయ్ తన ఫోన్ ను అప్పగించ లేదని చెప్పారు. అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.
పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి