న్యూస్

Prabhas : ‘ సూపర్ డేట్ అన్నా .. ఆ రోజే రిలీజ్ చెయ్యి ‘ రాధే శ్యామ్ ఆ రోజునే కావాలంటోన్న ప్రభాస్ ఫ్యాన్స్ !

prabhas
Share

Prabhas : పాన్ ఇండియా స్టార్ గా అవతరించి భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే రాధేశ్యామ్ అనే రొమాంటిక్-కామెడీ మూవీ షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావల్సి ఉండగా… కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. అయితే ఇప్పుడు కొత్త విడుదల తేదీని ఖరారు చేసే పనిలో చిత్రబృందం నిమగ్నం అయింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. దాంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.

Prabhas : రాధేశ్యామ్ రిలీజ్ అప్పుడే

prabhas

డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ రూపొందించిన రాధేశ్యామ్ (Radhe shyam)లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే (Pooja hegde) నటించింది. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా కనిపించి అలరించనున్నాడు. అయితే తాజాగా చిత్ర బృందం మార్చి 17వ తేదీన రాధేశ్యామ్ సినిమాని (new release date of Radhe Shyam) విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మార్చి 17వ తేదీ నాటికి కరోనా కేసులు తగ్గుతాయని.. థియేటర్లన్నీ 100% ఆక్యుపెన్సీతో నడుస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు. అలాంటి సాధారణ పరిస్థితి నెలకొంటే సినిమాను మార్చి 17న కచ్చితంగా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట.

ఆ రోజే కావాలంటున్న ఫ్యాన్స్

కొద్ది రోజుల్లో జనవరి నెల పూర్తవుతుంది. ఫిబ్రవరి ఒక్క నెల కాస్త ఓపిక పట్టుకుంటే మార్చిలో రాధేశ్యామ్ ఫీవర్ మొదలైపోతుంది. ప్రమోషన్లు, టీజర్స్, ట్రైలర్స్ ఇలా అన్నీ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తాయి. అందుకే ఆ రోజే రిలీజ్ చేయాలని అభిమానులు ప్రభాస్ కి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి చిత్రబృందం తమకు అనుగుణంగా పరిస్థితులు ఉంటేనే సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం ‘ సూపర్ డేట్ అన్నా .. ఆ రోజే రిలీజ్ చెయ్యి ‘ అంటూ రాధే శ్యామ్ మార్చి 17నే కావాలని ప్రభాస్ కు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థనలు పెట్టుకుంటున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి మరి.


Share

Related posts

సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసు.. సీబీఐ విచార‌ణ‌కు నో చెప్పిన సుప్రీం కోర్టు..

Srikanth A

ఏల్ఐసికి కోర్టు చివాట్లు..! జరిమానా..!ఎందుకంటే..?

Special Bureau

Hands: మీ అరచేతిలో ఈ రంగులు మచ్చలు ఉన్నాయా.!? ఎంత ప్రమాదమో.!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar