Bigg Boss 6 Telugu: సీజన్ ఫైవ్ తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ నెగిటివిటీ ఎదుర్కొన్న కంటెస్టెంట్ ఆర్జే కాజల్. ప్రారంభంలో అందరితో కలివిడిగా ఉన్న ఆర్జే కాజల్.. ఆ తర్వాత సన్నీ గ్యాంగ్ లో జాయిన్ అయ్యి చివరివరకు స్నేహంగా ఉంటూ.. టాప్ సిక్స్ వరకు చేరడం తెలిసిందే. అయితే అంతకుముందు షణ్ముక్ గ్యాంగ్ లో ఉన్న ఆమె ఒక్కసారిగా… సన్నీ గ్యాంగ్ లోకి రావడం ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. చాలా విషయాలకు క్లారిటీ ఇచ్చింది. ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ…” నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా నెగిటివిటీ ఉండేది. నాగిని డాన్స్ తో… నన్ను హేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అవసరం ఉండి వెళ్ళిపోతే గొడవలు తగ్గుతాయని అన్న వాళ్లు కూడా ఉన్నారు.
అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏమిటంటే… అవసరం ఎటువంటి విషయం అయినా నేను ఓపెన్ గా మాట్లాడేదాన్ని. లోపల ఏదో పెట్టుకుని .. బయటకు మరో ఒకటి మాట్లాడటం నాకు రాదు. కానీ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే…మాస్క్ గేమ్ చాలావరకు తప్పనిసరి. ఈ క్రమంలో ముసుగుల్లేకుండా నేను గేమ్ ఆడుతున్న అందుకే నన్ను చాలా మంది టార్గెట్ చేశారు. మన పర్సనాలిటీ అనేది మనం ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది. స్ట్రాటజీ గేమ్ ప్రారంభంలో ఆడాను అది.. బయట ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళతో కాదు మనుషులతో. పైగా బిగ్ బాస్ హౌస్ అంటే నాకు చాలా ఇష్టమైన గేమ్ షో. కాబట్టి నేను రియల్ లైఫ్ లో ఎలా ఉన్నానో హౌస్ లో కూడా అలాగే ఉండాలి అనుకున్నా.
ఈ నేపథ్యంలో షణ్ముక్ కి బయట ఎంత ఫాలోయింగ్ ఉందో.. అని అతనితో క్లోజ్ అవ్వలేదు. స్టార్టింగ్ లో షణ్ముక్ కి కనెక్ట్ అయ్యాను… ఆ తర్వాత సిరి జెస్సీ లతో కూడా ఉండేదాన్ని. కానీ షణ్ముఖం అంటే ఈ గ్యాంగ్ లోనే ఉండు.. అటు ఇటు వద్దు అన్న తరహాలో.. నాతో సంభాషించాడు. కానీ నాకు క్యారెక్టర్ ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది.. బిగ్ బాస్ హౌస్ అంటే ఇష్టం అందువల్లే.. షణ్ముఖ గ్యాంగ్ కి దూరం అయ్యాను. ఒకవేళ షణ్ముక్ జోన్ లోకి వెళ్తే.. అది దాటి బయటకు రావటానికి ఉండదు. వాళ్ల జోన్ లోనే ఉండాలి వేరే జోన్ లోకి వెళ్ళకూడదు… అది నాకు నచ్చదు అందుకే నేను సన్నీ మనస్ లతో.. ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాను. పైగా షణ్ముక్ కి పోస్సేసివ్ ఎక్కువ నాతో మాత్రమే ఉండాలి అనుకునే మనస్తత్వం.. అటువంటి మనస్తత్వం నాకు నచ్చేది కాదు అంటూ ఆర్జే కాజల్… బిగ్ బాస్ హౌస్ లో అనుభవాల గురించి.. ఫ్రెండ్షిప్ బాండ్ల గురించి సరికొత్త వ్యాఖ్యలు చేయడం జరిగింది.