ఎడ్యుకేషన్ హబ్‌గా రామకృష్ణాపురం – స్పీకర్ కోడెల

గుంటూరు, డిసెంబర్ 22:  సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్లొని క్రిస్మస్ కేక్ ను కట్ చేసి చిన్నారులతో సంతోషంగా గడిపిన స్పీకర్ ఈ గురుకులం 780 మంది బాలికలతో క్రమ శిక్షణతో నడుస్తుండటం సంతోషదాయకమన్నారు. క్రీస్తు సమాజానికి మంచి సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సమాజంలో పక్కవాళ్ల గురించి ఆలోచించాలన్నారు. సీఎం చంద్రబాబు రోజులో 20గంటలు రాష్ట్ర భవిష్యత్ కోసం కష్టపడుతున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో రామకృష్ణాపురం ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుంది. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి కేంద్రీయ విద్యాలయం, గురుకుల పాఠశాలలు ఇక్కడికి వస్తున్నాయని వెల్లడించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమ శిక్షణ నేర్చుకోవాలని సూచించారు. పిల్లలు ఇప్పటి నుండే వారి ఆలోచన శక్తిలో మార్పులు రావాలన్నారు.