ఆధార్ కార్డ్ ప్రతీ భారతదేశ పౌరుడికి ఉండే గుర్తింపు కార్డు. ఈ కార్డ్ ఒక్కటి నీ గుర్తింపును పూర్తిగా తెలుపుతుంది. అందుకే ఈ కార్డును చాలా జాగ్రత్తగా వాడుకోవాలని ఆఫీసర్లు తెలుపుతున్నాయి. అయితే ఆధార్ కార్డ్ విషయంలో పలు సందేహాలు, పుకార్లు సోషల్ మీడియలో షికారు చేస్తున్నాయి. వాటిని నమ్మొద్దని పలు మార్లు యూఐడీఏఐ సూచిస్తోంది.
ఈ ఆధార్ కార్డ్ ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) జారీ చేస్తోంది. ఈ కార్డ్ ను ప్రతీ ఒక్కరు తమ ఐడీ ప్రూఫ్‌గా ఎక్కడైనా సబ్మిట్ చేయొచ్చు. ఈ కార్డు అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఐడీ ప్రూఫ్ కావలసినప్పుడు ఈ కార్డును అడుగుతుంటారు. అలాగే అందరూ ఈ కార్డును క్యారీ చేస్తూ.. ప్రూఫ్ గా చూపిస్తుంటారు.
అయితే ఈ ఆధార్ కార్డు విషయంలో చాలా సందేహాలు, పుకార్లు ఇప్పటికీ చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. కొందరు కార్డు రూపంలో ఉండే ఆధార్ మాత్రమే చెల్లుతుందని చెప్తుంటారు. మరికొందరు లెటర్, ఈ ఆధార్, పీవీసీ కార్డులు చెల్లవని చెబుతుంటారు. ఇలాంటి పుకార్లకు చెక్ పెట్టేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సిద్ధమైంది.
ఈ పుకార్లపై క్లారిటీకూడా ఇచ్చింది. ఈ పుకార్లను ఏవీ నమ్మొద్దని సూచించింది. ఆధార్ కార్డు ఒక్కటే కాకుండా లెటర్, ఈ ఆధార్, పీవీసీ కార్డులను కూడా ఐడీ ప్రూఫ్‌గా ఉపయోగించొచ్చని సూచించింది. వీటన్నింటిని సబ్మిట్ చేసి ప్రభుత్వ సబ్సిడీలు, గ్రాంట్లను కూడా పొందొచ్చని పేర్కొంది. ఆధార్ కార్డులో పలు రకాల కార్డులు ఉంటాయి. అందులో ఆధార్ నెంబర్ జనరేట్ చేసిన తర్వాత ఆధార్ లెటర్ పోస్టు ద్వారా అందుతుంది. ఆ సమాచారమంతా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మెసెజ్ రూపంలో వస్తుంది.
ఇక రెండోది ఈ ఆధార్. యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి ఈ ఆధార్ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఆధార్ పీవీసీ కార్డ్ కూడా అందుబాటులోకి వచ్చింది. పీవీసీ కార్డులో చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫొటోతో పాటు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. డెమొగ్రఫిక్ వివరాలు, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, ఘోస్ట్ ఇమేజ్, ఇష్యూ, ప్రింట్ తేదీ లాంటివన్నీ ఇందులో పొందు పర్చుతారు. పీవీసీ కార్డుపై ఆధార్ లోగో సైతం ఉంటుంది. వీటిలో ఏ కార్డు అయినా ఒకేలా పని చేస్తుందని యూఐడీఏఐ పేర్కొంది.