న్యూస్

Kartikeya: డిఫరెంట్ గెటప్ లో “ఆర్ఎక్స్ 100” హీరో..!!

Share

Kartikeya: టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదటి సినిమా “ఆర్ఎక్స్ 100” తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని కార్తికేయ నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో మంచి గుర్తింపు పొందిన కార్తికేయ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకోవడం జరిగింది. హిపి, గుణ 369, ఇంకా అనేక సినిమాలతో అలరించనున్నాడు కార్తికేయ ఇటీవల “చావు కబురు చల్లగా” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

First Look Raja Vikramarka The Man On A Mission

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. కానీ సినిమాలో కార్తికేయ నటన హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం “రాజా విక్రమార్క”. ఈ సినిమాతో కొత్త డైరెక్టర్ అదేరీతిలో కొత్త నిర్మాత పరిచయం అవుతున్నారు. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో డిఫరెంట్ పోలీస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More: Payal Rajput : RX100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లోని  ఈ యాంగిల్ చూశారా ఎపుడైనా సూపర్ అంతే..

ఇదిలా ఉంటే తాజాగా బక్రీద్ పండుగ సందర్భంగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. రిలీజైన పోస్టర్ లో డిఫరెంట్ గెటప్ లో కార్తికేయ కనిపిస్తున్నారు. ముస్లిం వేషధారణలో కార్తికేయ స్టిల్ ఇవ్వడం జరిగింది. ఉగ్రవాదులను అరికట్టే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కార్తికేయ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నట్లు ఈ క్యారెక్టర్ కోసం చాలా వర్కౌట్స్ చేసినట్లు సమాచారం. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్ లో కార్తికేయ లుక్ చాలా సైలెంట్ గా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Share

Related posts

చైనాకు గూఢచారిగా వ్యవహరిస్తున్న జర్నలిస్టు ?

Special Bureau

Star Mahila : ఎవర్ గ్రీన్ గా దూసుకుపోతున్న స్టార్ మహిళ ప్రోగ్రామ్? యాంకర్ సుమకు సాటి లేరెవ్వరు?

Varun G

RRR: రామ్-భీమ్ పోస్టర్స్‌తో రాజమౌళి స్ట్రాటజీ మార్క్..పీక్స్‌లో ప్రమోషన్స్

GRK