Save money: డబ్బులు ఆదా చేస్తున్నారా ?అయితే  ఈ జాగ్రత్తలు తీసుకుని మీ డబ్బులు కాపాడుకోండి (పార్ట్ -1)

Share

Save money: డబ్బు ఆదా చేయాలంటే  చాలా  ధైర్యం ఉండాలి అనేది వాస్తవం. ధైర్యం లేని వాళ్ళు ఆమ్మో మా ఆదాయం తక్కువ దాచలేము ,మాకొచ్చేది ఖర్చులుపోగా మాకే  ఇంకా అవసరం అని ఎదో  ఒకటి సాకులు వెతుకుతుంటారు. సాకు  అని  ఎందుకు అనవలిసి వచ్చింది అంటే ఎంత తక్కువ ఆదాయం అయితే అంత తక్కువే దాచండి అది మిమ్మల్ని కచ్చితం గా కాపాడుతుంది. మన అవసరాలకు మించి ఏది ఎంత తక్కువకి వచ్చిన కూడా కొనే ప్రయత్నం చేయకూడదు. మనకు పనికిరాని వస్తువులు కొనుక్కుంటే మనకు పనికొచ్చే వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పాడు ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన వారెన్ బఫె.
ప్రతిరోజూ మన ఆరోగ్యం  మీద దృష్టి పెట్టి ఎంతో కొంత  సమయం దానికి కేటాయించాలి.ఇలా  చేయడం వలన  మనం అనారోగ్యాలకు దూరంగా ఉండి వాటి కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.

save money: డబ్బులు ఆదా చేస్తున్నారా ?అయితే  ఈ జాగ్రత్తలు తీసుకుని మీ డబ్బులు కాపాడుకోండి (పార్ట్ -2)

మన  స్థాయి లో ఆలోచించి ప్రవర్తించే  వారిని ఫ్రెండ్స్ గా చేసుకోవాలి. ఇలా చేయడం వలన అనవసరమైన వాటి జోలికి పోకుండా ఉంటాము ఫలితం గా దుబారా ఖర్చులు తగ్గుతాయి. మీరు ఇలా చేస్తే   ఆకస్మికంగా ధనవంతులైపోతారు లేదా మీకు ఎక్కువ వడ్డీ వస్తుంది అని మాటలు  చెప్పి మభ్య పెడుతుంటారు.వీటిలో  తొంబై తొమ్మిది మోసాలే ఉంటాయి. చిట్ ఫండ్స్ ఇలాంటి వాటి కిందకు వస్తాయి.కొంతమంది ముందు కావలిసిన వస్తువులు తీసుకుని తరువాత వాయిదాల్లో కట్టమని  బ్రతిమాలాడతారు.ఎంతో అవసరం ఉంటే తప్ప ఇలాంటి వి కొనుగోలు చేయకూడదు. కొన్ని ఇలాంటి వి నాణ్యత తక్కువగా ఉండవచ్చు . పైగా వడ్డీ కూడా కలిపి వాయిదా లో కట్టించుకుంటారు. వాయిదా రోజు డబ్బులు కట్టకపోతే చాలా హీనంగా మాట్లాడుతారు.లేదా వడ్డీ ఇంకా పెంచేస్తారు. ఇలా వ్యాపారం చేసే వాళ్ళు మన చుట్టూ ఎక్కువ మంది ఉన్నారు.మరి కొంత మంది మంచి ప్లాట్లు వాయిదా పద్ధతిలో తీసుకోండి ,మూడేళ్ళ లో నాలుగు రెట్లు ధర పెరుగుతుంది  అని చెబుతారు. అంత ధర పెరిగే దాన్ని  వాళ్ళే ఉంచుకుంటారు కానీ మనకెందుకు అమ్ముతున్నారు అని ఆలోచించము.ముఖ్యంగా కొత్త గా ఉద్యోగంలో చేరిన వారిని, జీవితంలో పెద్దగా అనుభవం లేని వారి ని ఇలా మభ్యపెడుతున్నారు.

save money: డబ్బులు ఆదా చేస్తున్నారా ?అయితే  ఈ జాగ్రత్తలు తీసుకుని మీ డబ్బులు కాపాడుకోండి (పార్ట్ -2)

వాయిదా ల మీద ప్లాట్లు అనేవి అసలు  కొనకూడదు.  ఇలా  డబ్బులు వసూలు చేసి  బోర్డు తిప్పేసిన పెద్ద కంపెనీల గురించి మనం వింటూనే ఉంటాం.
మన డబ్బులు నమ్మకమైన బ్యాంకులో గాని లేదా పోస్టాఫీసులో గాని  దాచుకోవడం మంచి పద్దతి.మీకు మంచి సలహాలు ఇచ్చే వారు  ఉంటే మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు.నెలవారీ “సిప్” విధానంలో పెట్టుబడి పెట్టండి . మార్కెట్ పరిస్థితి బాగుంది అనుకున్నప్పుడు  మాత్రమే అమ్ముకొని ఏదైనా బ్యాంకులో పెట్టుకోవచ్చు.


Share

Related posts

YS Jagan : జ‌గ‌న్ ను మించిపోయే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ప‌క్క రాష్ట్రం నేత‌

sridhar

YS Jagan : జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం… అంబ‌టి రాంబాబుకు మంత్రి ప‌ద‌వి?

sridhar

మెడలోతు వర్షపు నీటిలోకి దిగి.. ప్రభుత్వాన్ని వేడుకున్న చిన్నారి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Varun G