NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

Silk Smitha: విజయలక్ష్మి వడ్లపాటి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ సిల్క్ స్మిత అంటే మాత్రం తెలియని వారు ఉండరు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన సిల్క్ స్మిత‌కు 15 ఏళ్లకే త‌ల్లిదండ్రులు వివాహం చేశారు. అత్తింటి వేధింపులు భరించలేక పెళ్లి జ‌రిగిన కొంత కాలానికి సిల్క్ స్మిత మ‌ద్రాసు పారిపోయింది. సినీ ఇండ‌స్ట్రీలోకి వెళ్లి హీరోయిన్ కావాల‌ని ఆశ‌ప‌డింది. ఎన్నో క‌ష్టాలు, అవ‌మానాలు, తిర‌స్క‌ర‌ణ‌ల అనంత‌రం సిల్క్ టచప్ ఆర్టిస్ట్‌గా కొన్నాళ్లు పనిచేసింది. ఆ తర్వాత చిన్న, చిన్న పాత్ర‌ల‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

80వ దశకంలో వెండితెరపై శృంగార తారగా సిల్క్ స్మిత ఓ వెలుగు వెలిగింది. మత్తెక్కించే కళ్ళు, మైమరిపించే అందంతో సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసింది. తమిళ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన సిల్క్ స్మిత.. ఆ తరువాత తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో 450 కి పైగా చిత్రాల్లో నటించింది మరియు నర్తించింది. నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. అగ్ర హీరోలు సైతం తన డేట్స్ కోసం ఎదురు చూసేలా చేసింది. ఒకానొక స‌మ‌యంలో స్టార్ హీరో హీరోయిన్లను మించి రెమ్యునరేషన్ తీసుకుని లేడీ సూప‌ర్ స్టార్‌గా అవ‌త‌రించింది.

అప్పట్లో ప్రతి సినిమాలో సిల్క్ స్మిత చేత స్పెషల్ సాంగ్ చేయించేవారు. అసలు సిల్క్ లేకపోతే సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్ సైతం ముందుకు వచ్చేవారు కాదు. ఆ రేంజ్ లో సిల్క్ స్మిత క్రేజ్ సంపాదించుకుంది. అప్ప‌ట్లో సిల్క్ స్మిత‌కు అభిమానుల క‌న్నా ఆమెను ఆరాధించే భక్తులు ఎక్కువ‌గా ఉండేవారు. కేవ‌లం సిల్క్ స్మిత‌ను చూడ‌టం కోస‌మే థియేట‌ర్స్ కు వ‌చ్చేవారు. అటువంటి సిల్క్ స్మిత 36 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రేమించిన వాడు మోసం చేయడం, కుటుంబ సభ్యులు అండగా లేకపోవడం, ఒంటరితనం బాధించడంతో ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా త‌నువు చాలించింది. సిల్క్ స్మిత చనిపోయి దాదాపు రెండున్నర దశాబ్దాలు అవుతున్నా ఆమె గురించి ఏదో ఒక విషయం తెరపైకి వస్తూనే ఉంది.

అయితే ఒక‌ప్పుడు సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్ వేలంపాటలో అమ్ముడైంద‌న్న‌ మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. 1984 లో ఒక సినిమా షూటింగ్ లో బిజీ ఉన్న సిల్క్ స్మిత విరామ స‌మ‌యంలో ఒక యాపిల్ తిన‌బోయింది. స‌గం కొరికి తింటూ ఉండ‌గా షాట్ రెడీ అని చెప్పి ఆమెను పిలిచారట. దాంతో సిల్క్ యాపిల్ ను అక్క‌డే వ‌దిలేసి వెళ్లిపోయింది. అది గ‌మ‌నించిన సిల్క్ స్మిత మేక‌ప్ మ్యాన్ అక్క‌డిక‌క్క‌డే ఆ యాపిల్ ను తీసుకుని వేలం వేశాడు. సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్ వేలంపాట‌లో ఏకంగా ఓ వ్య‌క్తి రూ. 26 వేలకు కొనుక్కున్నాడ‌ట‌. 80వ ద‌శ‌కంలో రూ. 26 వేలంటే మామూలు విష‌యం కాదు. అందువ‌ల్ల ఈ విష‌యం అప్ప‌ట్లో టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీగా మారింది. ఏదేమైనా సిల్క్ స్మిత క్రేజ్ కు ఇదొక నిద‌ర్శ‌నం అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?