పెరిగిన వెండి ధర

ఢిల్లీ, జనవరి 4: వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. గత నాలుగు రోజుల నుండి వెండి ధర పెరగడంతో బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర 40వేలరూపాయల మార్కును దాటింది. శుక్రవారం ఒక్కరోజులోనే 440 రూపాయలు పెరిగి కిలో వెండిధర 40వేల140 రూపాయలు పలికింది. పారిశ్రామిక వర్గాలతోపాటుగా నాణేల తయారీదారుల నుండి డిమాండ్ రావడంతో ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

వెంఢి ధర పెరిగినా బంగారం ధర కాస్తింత దిగివచ్చింది. డాలర్‌తో రూపాయి బలపడటంతోపాటుగా స్ధానికంగా కొనుగోళ్లు తగ్గడంతో 10 గ్రాముల పసిడి ధర 145 రూపాయలు తగ్గి 32వేల 32వేల690 రూపాయలుగా ఉంది. గత మూడు రోజుల్లో బంగారం ధర 565 రూపాయలు మేర పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి లోహాల ధరలు స్పల్పంగా పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1293.61 డాలర్లు, ఔన్సు వెండి ధర 15.75 డాలర్లు గా ఉంది.

SHARE