న్యూస్

Siri Hanmanth : ‘ వాళ్ళిద్దరి ప్రేమ అంత వీక్ కాదు ‘ సిరి హన్మంత్ బంగారం రా .. దీప్తి సునైనా గురించి ఏమందో చూడండి !

Siri Hanmanth
Share

Siri Hanmanth : వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లోనూ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇండియాలో మొదట బాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ షో నెమ్మదిగా సౌత్ ఇండియా మొత్తం వ్యాపించింది. ఈ షో ఇప్పటికే ఎందరికో లైఫ్ ఇచ్చి పాపులర్ చేసింది. బిగ్‌బాస్ షోలో ఎంట‌ర్ అయిన త‌రువాత కొందరు పాపులారిటీని సాధిస్తే మరికొందరు నెగిటివిటీని మూట‌గ‌ట్టుకున్నారు. వారిలో ప్రధానంగా ష‌ణ్ముఖ్, సిరి హన్మంత్ పేర్లు వినిపిస్తాయని చెప్పవచ్చు. ష‌ణ్ముఖ్ తన క్యారెక్టర్ బ్యాడ్ అని బిగ్‌బాస్ షో తర్వాత ఒక భావన కొందరిలోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా దీప్తి సునైనా ష‌ణ్ముఖ్ పై నెగిటివిటీ పెంచుకొని అతడికి బ్రేకప్ చెప్పింది.

Siri Hanmanth : సిరి హన్మంత్ పై నెటిజన్ల ట్రోల్స్..

Siri Hanmanth

దీప్తి, షన్ను బ్రేకప్ పై సిరి హన్మంత్ ని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన షణ్ముఖ్.. దీప్తి కేవలం తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా మరోవైపు సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీ‌హ‌న్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇటీవ‌ల సిరితో క‌లిసి ఉన్న ఫొటోల‌ను డిలీట్ చేసాడు. కేవ‌లం వారిద్ద‌రూ క‌లిసి న‌టించిన వెబ్‌సిరీస్‌ల‌కు సంబంధించి ఫొటోల‌ను మాత్ర‌మే ఉంచాడు. దీంతో వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే విడిపోతున్నారనే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్ కోసం సిరి తాజాగా వైజాగ్ వెళ్లింది. అక్క‌డ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించింది.

ట్రోల్స్ చూసి డిప్రెషన్ లోకి వెళ్లాను…

siri hanmanth

“బిగ్‌బాస్ లో జెస్సీ, ష‌ణ్ముక్ ఇద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్‌. వారి త‌ర్వాత యాంకర్ ర‌వి బ్ర‌ద‌ర్‌లా ఉన్నారు. నాకు, షణ్ముఖ్ కి మ‌ధ్య ఉన్నది కేవ‌లం ఫ్రెండ్ షిప్ మాత్రమే… మనం బ‌య‌ట ఉన్న‌ప్పుడు ప్రతిరోజూ ఎంతోమంది ఎమోష‌న్స్‌ను చూస్తుంటాం. అదే బిగ్ బాస్ హౌస్‌లో అయితే ఆ హౌస్ లో ఉన్నవారి ఎమోష‌న్స్ మాత్ర‌మే మ‌న‌కు క‌నిపిస్తాయి. ఒక మనిషి ఎమోష‌న‌ల్‌గా ఫీల్ కావ‌డం అనేది సర్వ సాధారణం. అయితే నాకు, షణ్ముఖ్ కి మ‌ధ్య ఎమోషనల్ బాండింగ్ కాస్త ఎక్కువ అయింది. దీప్తి సునైనా నాకు కూడా స్నేహితురాలే. నేను హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ చూసి చాలా డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయాను. త‌ర్వాత కాస్త నెమ్మదిగా బయటపడ్డాను” అని ఆమె చెప్పుకొచ్చింది.

Siri Hanmanth : ఇన్నాళ్ళకి షన్ను దీప్తి ల బ్రేకప్ మీద నోరు విప్పిన సిరి హన్మంత్ .. ఒక్క మాటతో తేల్చేసింది !


Share

Related posts

రెండువేలకు ఖాళీ కొబ్బరి చిప్పలు

Siva Prasad

రష్మిక విషయంలో రూమర్..దర్శకుడే క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది ..?

GRK

YSRCP: వైసీపీ వివిధ విభాగాల నేతలతో విజయసాయిరెడ్డి భేటీలు..బలోపేతానికి దిశానిర్దేశం

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar