బిగ్ బాస్ నాలుగో సీజన్ లో యాంగ్రీ యంగ్ మాన్ గా మాత్రమేగాక జన్యూన్ గేమ్ ఆడిన కంటెస్టెంట్ గా సోహెల్ మంచి పేరు సంపాదించాడు. మనసులో ఎటువంటి భావోద్వేగం ఉన్నా బయటకు వెల్ల బుచ్చుతూ హౌస్ లో ఉన్నంత కాలం ఎంతగానో అలరించాడు. నాలుగో సీజన్ లో మూడో స్థానంలో క్యాష్ ప్రైజ్ గెలుచుకున్న సోహెల్.. బయట మాత్రం బిగ్ బాస్ టైటిల్ కంటెస్టెంట్ కంటే భారీగానే క్రేజ్ సంపాదించాడని చాలా మంది చెబుతారు.
అంతేకాకుండా వచ్చిన సంపాదనలో చాలామంది నిరాశ్రయులను స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేస్తూ మరోపక్క వరుస ఇంటర్వ్యూ ఇస్తూ సినిమా ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు మెగాస్టార్ చిరంజీవి తో అదేవిధంగా నాగార్జున సపోర్ట్ దక్కించుకున్న సోహెల్.. తాజాగా వాళ్ళిద్దరినీ కలవడం జరిగింది.
చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకుని చిరంజీవి భార్య సురేఖ తో ఇద్దరితో కలిసి సోహెల్ ఫోటో దిగడం జరిగింది. ఇదే తరుణంలో నాగార్జునతో కూడా సోహెల్ బేటీ అవ్వటం వాళ్ళిద్దరు బేటీకి సంబంధించి వీడియో కూడా బయటకు రావడం ఇప్పుడు వైరల్ గా మారింది. మొత్తంమీద చూసుకుంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వారి సపోర్ట్ అందుకునే రీతిలో సోహెల్ రాణి స్తున్నట్లు.. ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.