స్టార్ మా తెలుగు చానెల్ దేశంలోనే నెంబర్ వన్ జీఈసీ చానెల్ అని.. బిగ్ బాస్ సండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున చెప్పారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. టీఆర్పీ పరంగా ఎక్కువ రేటింగ్స్ చూశాం. ఎక్కువ మంది ప్రేక్షకులు ఆదరించే చానెల్ ను చూశాం కానీ.. ఈ జీఈసీ చానెల్ ఏంటి? దేశంలోనే నెంబర్ వన్ జీఈసీ చానెల్ అంటే ఏంటి అసలు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ముందుగా జీఈసీ అంటే ఏంటో తెలుసుకుందాం. జీఈసీ అంటే.. జనరలిస్ట్ చానెల్. Generalist Channel. ఒక టీవీ చానెల్ కు కానీ… రేడియా చానెల్ కు కానీ… ఇటువంటి గుర్తింపు లభిస్తుంది. దీన్నే జీఈసీ గుర్తింపు అంటారు.
అంటే.. ఒక చానెల్ ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. ఒక భాషకే పరిమితం కాకుండా.. దేశంలోని అన్ని ప్రాంతాల ఆడియెన్స్ కు అనుగుణంగా.. ప్రోగ్రాములను రూపొందిస్తే.. దానికి జీఈసీ గుర్తింపు వస్తుంది.
ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే.. తెలుగు బిగ్ బాస్ షోను దేశంలోని అన్ని ప్రాంతాల్లో.. అన్ని రాష్ట్రాల్లో ఆదరిస్తున్నారు. దేశమంతా తెలుగు బిగ్ బాస్ షోను చూస్తున్నది. అందులోనూ ఎక్కువ సంఖ్యలో మిగితా ఏ చానెల్ కు రానంత రేటింగ్స్ దేశమంతా వస్తుండటంతో… స్టార్ మా చానెల్ దేశంలోనే నెంబర్ వన్ జీఈసీ చానెల్ గా నిలిచింది అన్నమాట.
నిజానికి తెలుగు చానెల్స్ ఏ ప్రోగ్రామ్ చేసినా.. అది తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతుంది. ఒకవేళ వేరే రాష్ట్రాల్లో తెలుగు వాళ్లు ఉంటే.. వాళ్లు తెలుగు చానెల్స్ చూస్తారు. కానీ.. బిగ్ బాస్ షోను మాత్రం నాగార్జున చెప్పినట్టుగా.. దేశమంతా ఆదరిస్తోంది అన్నమాట. మొత్తానికి బిగ్ బాస్ షోకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చింది అంటే మామూలు విషయం కాదు.
సండే ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో చూస్తారా?