Sudigali sudheer : సుడిగాలి సుధీర్ పేరు చెబితే చాలు.. నవ్వు రాని వాళ్లకు కూడా నవ్వు వస్తుంది. తెలుగులో కామెడీకి మరో అర్థం చెప్పాడు సుధీర్. ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులే. ఎక్స్ ట్రా జబర్దస్త్ ను కేవలం సుధీర్ స్కిట్ కోసమే చూసేవాళ్లు కోకొల్లలు. సుధీర్ స్కిట్ కోసం, రష్మీ కోసం.. ఇద్దరి కెమిస్ట్రీ కోసం కూడా చూసేవాళ్లు చాలామంది ఉన్నారు.

సుడిగాలి సుధీర్ అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్. అంతే కాదు.. సుధీర్, రష్మీ జంట కూడా బుల్లితెర మీద ఫుల్లు డిమాండ్ ఉన్న జంట. వీళ్ల రొమాన్స్ కూడా బాగా పండుతుంది ఆన్ స్క్రీన్ మీద.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ను తెగ వాడేసుకుంటున్న జబర్దస్త్ టీమ్ లీడర్లు
అయితే.. సుడిగాలి సుధీర్ ను జబర్దస్త్ టీమ్ లీడర్లు తెగ వాడేసుకుంటున్నారు. ఎందుకంటే.. సుడిగాలి సుధీర్ ఎక్కడుంటే అక్కడ కామెడీ ఉంటుంది కాబట్టి… మనోడితో స్కిట్లు చేస్తూ పాపులర్ అవుతున్నారు. తాజాగా బుల్లెట్ భాస్కర్ కూడా సుడిగాలి సుధీర్ తోనే స్కిట్లు చేస్తున్నాడు. సుధీర్ ను ట్రెండింగ్ స్టార్ అంటూ చెబుతూ.. సుధీర్ తో చేసిన కామెడీ అదిరిపోయింది.
తనకు సపరేట్ టీమ్ ఉన్నా.. సుధీర్ ను తన స్కిట్ లో పెట్టి ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించాడు బుల్లెట్ భాస్కర్.తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో సుధీర్ ను భాస్కర్, పొట్టి నరేశ్ ఎలా ఆడుకున్నారో మీరే చూడండి.