తెలుగు రాష్ట్రాల్లో తానా ‘చైతన్య స్రవంతి’

అమరావతి : అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో 2019  జులై 4 నుంచి 6 వరకు జరిగే తానా (Telugu Association of North America) 22వ మహాసభలకు సన్నాహకంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘చైతన్య స్రవంతి’ కార్యక్రమాలను నిర్వహిస్తారు. 2018 డిసెంబరు 23 నుంచి జనవరి 12 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లలో పలు సాంస్కృతిక, భాషాసాహిత్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన వెల్లడించారు. తెలుగు భాషాభివృద్ధి, మరుగున పడుతున్న జానపద కళారూపాలను కాపాడుకునేందుకే  చైతన్య స్రవంతిని తలపెట్టామని ఆయన వివరించారు. ఈ వేడుకలలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. తానా చైతన్య స్రవంతి కార్యక్రమ వివరాలను ఈ కింద చూడవచ్చు.