సాధారణంగా కారు కొనాలంటే మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు వెచ్చించాల్సిందే.. అయితే సామాన్యుడికి అందుబాటులో లక్ష రూపాయలకే టాటా.. నానో కార్ ను రూపొందించింది.. అత్యంత చవకైన కారుగా గుర్తింపు తెచ్చుకున్న టాటా నానో వాహనం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది.. ఈ నానో కారు విడుదలై దశాబ్దం అయినప్పటికీ ఈ కారుకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ప్రస్తుతం డీజిల్ , పెట్రోల్ వాహనాలకు బదులుగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.. ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నవే.. టాటా మోటార్స్ సామాన్యుడికి అందుబాటులో ఈ నానో కారును ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది..
ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కొరకు టాటా మోటార్స్, జయెం నియో భాగస్వామ్యం అయ్యాయి.. జయెం నియో బ్రాండ్ కింద నానో హ్యచ్ బ్యాక్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ ను విడుదల చేయడమే వీటి ప్రధాన లక్ష్యం. ఈ కార్ ను ఇప్పటికే చాలాసార్లు స్పాట్ టెస్ట్ నిర్వహించారు..జయెం నియో అనే బ్యాడ్జింగ్ తో లాంచ్ చేయనుంది. ఎలక్ట్రిక్ కారు టాటా నానో డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇందులో 17.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటారు అమర్చారు. ఇది 23 బిహెచ్పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీని ఒకసారి పూర్తి చార్జింగ్ చేస్తే 203 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం 85 కిలోమీటర్లు. ఈ కారు లో ఆధునిక సేఫ్టీ ఫీచర్లు కూడా ఏర్పాటు చేశారు.