NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ అన్న Vs వైసీపీ త‌మ్ముడు… రంజుగా మారిన గోదారి రాజ‌కీయం…!

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తునిలో రాజ‌కీయ కాక కేక రేపుతోంది. ఇక్క‌డి నుంచి మ‌రోసారి పోటీచేసి.. వైసీపీ వ్య‌తిరేక గాలిలో విజ‌యం ద‌క్కించుకుందామ‌ని య‌న‌మ‌ల రామ‌కృష్ణు డు త‌మ్ముడు య‌న‌మ‌ల కృష్ణుడు ప్ర‌య‌త్నించారు. అయితే.. ఆయ‌న‌ను కాద‌ని ఈ సారి రామ‌కృష్ణుడు త‌న‌కుమార్తె దివ్య‌కు టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో ఇప్పుడు కృష్ణుడు వ‌ర్సెస్ రామ‌కృష్ణుడు రాజ‌కీ యాలు సాగుతున్నాయి. త‌న‌కు ద‌క్క‌నిది ఎవ‌రికీ ద‌క్క‌కూడ‌ద‌న్న రీతిలో కృష్ణుడు రాజ‌కీయం చేస్తున్నారు.

అయితే.. క‌నీసం త‌న కుమార్తెను అయినా గెలిపించుకుని వార‌స‌త్వాన్నినిల‌బెట్టుకోవాల‌ని మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో తుని రాజ‌కీయం హాట్ హాట్ గా మారింది. వాస్త‌వానికి 1983లో టీడీపీ ఆవిర్భ‌వించిన నాటి నుంచి 2004 వ‌ర‌కు కూడా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు గెలుస్తూనే వ‌చ్చారు. ఆయ‌న హ‌వాకు అడ్డు లేకుండా పోయింది. 2009లో ఇక్క‌డ మారిన రాజకీయం య‌న‌మ‌ల కుటుంబానికి వ‌రుస ప‌రాజ‌యాలు అందిస్తూనే ఉంది. తునిలో య‌న‌మ‌ల కుటుంబం గెలిచి 20 ఏళ్లు అవుతోంది. అస‌లు య‌న‌మ‌ల కుటుంబ తీరు వ‌ల్లే తుని ఓట‌రు ఆ కుటుంబానికి ఎప్పుడో దూర‌మ‌య్యార‌న్న‌ది వాస్త‌వం.

ఇక ఇప్పుడు త‌మ్ముడు ను ప‌క్క‌న పెట్టేసి కుమార్తె దివ్య కు టిక్కెట్ ఇప్పించుకోవ‌డంతో మ‌హిళా కోటాలో
ఈ సారైనా విజ‌యం ద‌క్కించుకుంద‌మ‌నేది య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌య‌త్నం. అయితే.. ఈ సీటు నుంచి వ‌రుస‌గా రెండు సార్లు పోటీ చేస్తూ వ‌చ్చి.. ఓటమిని ఎదుర్కొన్న కృష్ణుడు.. ఈ ద‌ఫా కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో (అంటే.. జ‌న‌సేన‌+టీడీపీ క‌ల‌వ‌డంతో త‌న గెలుపు ఖాయ‌మ‌ని) త‌న‌కు టికెట్ లేకుండా పోవ‌డంతో ఆయ‌న త‌న సొంత అన్న య‌న‌మ‌ల‌పైనే ఆగ్ర‌హంవ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ నేత‌ల‌కు కూడా ఆయ‌న ట‌చ్‌లోకి వెళ్లిపోయార‌నే చ‌ర్చ సాగుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి సంపూర్ణంగా స‌హ‌క‌రించేందుకు మౌఖికంగా కృష్ణుడు అంగీక‌రించార‌నేది తుని వైసీపీ నేత‌ల మాట‌. వైసీపీ అధికారంలోకి రాగానే.. కృష్ణుడుకి ఎమ్మెల్సీ సీటును ఇస్తామ‌ని.. సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ద్వారా సీఎం జ‌గ‌న్ నేరుగా క‌బురు చేశార‌నేది కూడా బ‌హిరంగంగా వినిపిస్తు న్న‌మాట‌. దీంతో య‌న‌మ‌ల కుటుంబంలోనే టికెట్ చిచ్చు పెట్టిన‌ట్ట‌యింది. అయితే.. బ‌ల‌మైన మాట తీరు, సీనియ‌ర్ల అండ ఉన్న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాత్రం త‌న కుమార్తెను ఎట్టి ప‌రిస్తితిలోనూ గెలిపించుకుని తీరుతాన‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related posts

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju