ఒక్క సారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై 100 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు..!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్రం కూడా విద్యుత్‌ వాహనాలను కొనుగోలు చేసే వారికి సబ్సిడీ కూడా ఇస్తోంది. ఇక కంపెనీలు కూడా అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. అయితే మార్కెట్‌లో ఇప్పటికే ఎన్నో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు వచ్చాయి. వాటిల్లో సింగిల్‌ చార్జ్‌తోనే ఏకంగా 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే స్కూటర్లు కూడా ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఏథర్‌ 450ఎక్స్‌

these 5 electric scooters will give 100 km on single charge

బెంగళూరు, చెన్నైలలో ఈ స్కూటర్‌ను ఎక్కువగా కొంటున్నారు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 107 కిలోమీటర్లు వెళ్లవచ్చు. రూ.1 లక్ష ధరకు ఈ స్కూటర్‌ లభిస్తోంది.

2. హీరో ఆప్టిమా

ఈ స్కూటర్‌లో ఉన్న బ్యాటరీ పూర్తిగా చార్జ్‌ అయ్యేందుకు సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. దీంతో 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. దీని ధర కేవలం రూ.41,770 మాత్రమే.

3. ఓకినావా రిడ్జ్‌

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లను తయారు చేయడంలో ఈ కంపెనీ కూడా పేరుగాంచింది. ఈ స్కూటర్‌ గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. దీని ధర రూ.44,990గా ఉంది.

4. బజాజ్‌ చేతక్‌

పాత చేతక్‌ స్కూటర్‌ను మార్చి బజాజ్‌ కంపెనీ కొత్త చేతక్‌ను ఎలక్ట్రిక్‌ మోడల్‌ రూపంలో విడుదల చేసింది. దేశంలో పలు ఎంపిక చేసిన సిటీల్లో ఈ స్కూటర్‌ లభిస్తోంది. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఫుల్‌ చార్జింగ్‌ చేస్తే 95 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. దీని ధర రూ.1 లక్షగా ఉంది.

5. టీవీఎస్‌ ఐక్యూబ్‌

ఈ స్కూటర్‌ను ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 75 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. గంటకు 78 కిలోమీటర్ల వేగంతో దీనిపై వెళ్లవచ్చు. దీని ధర రూ.1.15 లక్షలుగా ఉంది.