Vijay Deverakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పరిచయం అక్కర్లేదు. తెలుగునాట, ముఖ్యంగా యువత ఎక్కువగా అతన్ని ఫాలో అవుతూ వుంటారు. ఒక్క అర్జున్ రెడ్డి సినిమాతో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ‘లైగర్’ అంటూ మన ముందుకు వస్తున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం కావడంతో ఈ సినిమాపైన మంచి అంచనాలు వున్నాయి.
Vijay Deverakonda : రిలీజు సంగతి
ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో అట్టహాసంగా విడుదల కానుంది. ఇక ఈ మూవీ తర్వాత విజయ్ సుకుమార్ దర్శకత్వంలో చేయాలి. కానీ లైగర్ షూటింగ్ పూర్తైన వెంటనే పూరీ జగన్నాథ్ అనూహ్యంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ను విజయ్ తో స్టార్ట్ చేసేసాడు. ఇది కూడా పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ షురూ చేయనుంది. అలాగే ‘జనగణమన’ అనంతరం విజయ్ దర్శకుడు శివ నిర్వాణతో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చేయనున్నాడని టాక్.
అభిమానులు ఎదురు చూసినది జరగలేదు!
దర్శకుడు సుకుమార్ అంటే టాలీవుడ్లో వున్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ఈయన దర్శకత్వంలోని చేయాలని ఎదురు చూస్తూవుంటారు మన హీరోలు. ఇక ఇలాంటి అవకాశం మన విజయ్ కి దక్కినప్పటికీ ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. ఈ విషయంలో మన రౌడీ బాయ్స్ కాస్త అసహనానికి గురి అవుతున్నారు. వీలైనంత త్వరగా తన అభిమాన హీరో సుకుమార్ దర్శకత్వంలో చేయాలని వారు కోరుకుంటున్నారు. కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు.