కేరళ బంద్-ఆందోళనకారుల విధ్వంసం

శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి రుతుస్రావ వయస్సులో ఉన్న ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఘటనను నిరసిస్తూ కేరళలో బంద్‌ నిర్వహిస్తున్నారు. బంద్ సందర్భంగా  కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భకతులు భక్తులు ఆందోళనలు చేస్తున్నారు.  రాళ్లు రువ్వుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. కాలికట్‌, కన్నూర్‌, తిరువనంతపురం, పాలక్కాడ్‌ జిల్లాల్లో నిరసనకారులు బస్సులపై, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు దిగారు.  60 బస్సులు ధ్వంసమయ్యాయి.  . పోలీసులు 8 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ఇలా ఉండగా శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయ అర్చకుడిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా అర్చకుడు వ్యవహరించారని ఆరోపిస్తూ ఒక న్యాయవాది ఈ పిటిషన్‌ దాఖలు చేశారు  ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించి స్వామి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ చేసిన అంశంపై న్యాయవాది సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.