NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

Amit Shah: ఏపీ రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టులపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్ధి సత్యకుమార్ కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పరిటాల సునీత తో కలిసి కూటమి ముఖ్య నేతలు సభలో పాల్గొన్నారు. తొలుత అమిత్ షా కు చంద్రబాబు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత చంద్రబాబును కూడా అమిత్ షా శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో అమిత్ షా మాట్లాడుతూ .. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి,  దౌర్జన్యకర పాలన అంతం చేసేందుకు టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. ఆంధ్రాలో భూమాఫియాను అంతం చేసేందుకు, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని అన్నారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడుతామని తెలిపారు. జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రాధమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని తొలగించడంపై ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషను రక్షిస్తామని చెప్పారు. బీజేపీ ఉన్నంత వరకూ తెలుగు భాషను అంతం కానివ్వమని అన్నారు. ఈ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని అమిత్ షా అన్నారు. జగన్ అవినీతిలో కూరుకుపోయి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేశారని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోడీ సర్కార్ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి అవుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. దేశాన్ని రక్షించేందుకు, ఉగ్రవాదులు, నక్సలైట్లను అరికట్టేందుకు మోడీని మళ్లీ ప్రధానిని చేయాలన్నారు. మూడో సారి ప్రధాని అయ్యేది మోడీనేనని అన్నారు. ఉమ్మడి ఏపీని చంద్రబాబు ప్రధమ స్థానంలో నిలిపారని అన్నారు. విభజన తర్వాత కూడా ఏపీని ప్రగతి పథంలోకి తీసుకువెళ్లారని చెప్పారు. ఆయన చేసిన అభివృద్ధిని జగన్ అధోగతి పట్టించారని విమర్శించారు.

జగన్ మద్య నిషేదం చేస్తానని మాట తప్పారన్నారు. ఆరోగ్య శ్రీకి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు, మోడీని గెలిపిస్తే రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 25కి 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. అసెంబ్లీలో మూడింట రెండొంతుల సీట్లతో చంద్రబాబును సీయం చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

ఇండియా కూటమిపైనా అమిత్ షా విమర్శలు గుప్పించారు ఆ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్, రాహుల్ గాంధీ.. వీరిలో ఎవరిని చేస్తారో చెప్పాలన్నారు. ఆ కూటమిలో ప్రధాని అభ్యర్ధే లేరని ఎద్దేవా చేశారు అమిత్ షా.

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!