సీఎం కాన్వాయిని అడ్డుకున్న బిజెపి

కాకినాడ, జనవరి4: కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌ను భారతీయ జనతా పార్టీ నేతలు అడ్డుకున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు బిజెపి నేతలను అరెస్టు చేశారు. కాన్వాయ్‌ని అడ్డుకున్న బిజెపి నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి మోదీ ఏమీ సహాయం చేయలేదనీ, బిజెపి నేతలకు రాష్ట్రంలో ఉండే అర్హత ఏమాత్రం లేదనీ చంద్రబాబు అన్నారు.. ప్రధాని మోదీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మీరు సమర్ధిస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంతో పాటు దేశాన్ని మోదీ నిలువునా ముంచేశారని విమర్శించారు.

కాకినాడలో తలపెట్టిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి సీఎం వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.