NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan: ఈ ఉగాదిని సీఎం జగన్ భారీగా ప్లాన్ చేస్తున్నారు.. కొత్త జిల్లాలు, కొత్త మంత్రులు.. కొత్త..!?

YS Jagan: CM Planning Grand New Ugadi 2022..

YS Jagan: 2022 ఉగాది ఏపీలో సమూల మార్పులు రాబోతున్నాయి.. సీఎం జగన్ మదిలో ఉన్న ప్రణాళికలను అమలు చేయడానికి ఉగాదిని వేదికగా చేసుకోనున్నారు.. ప్రభుత్వ ప్రక్షాళన.. పాలన ప్రక్షాళన.. పనిలో పనిగా పార్టీ ప్రక్షాళన వంటి కీలకమైన మార్పులను ఉగాదితోనే శ్రీకారం చుట్టబోతున్నారు.. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు.. కార్యకలాపాల మొదలు అన్నీ ఉగాది నాటికీ మొదలు పెట్టాలని నిన్ననే సంకేతాలు ఇచ్చేసారు.. ఆయన జిల్లా కలెక్టర్లు కొత్తా జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సీరియస్ గా చెప్పారు.. తద్వారా పాలనలో ప్రక్షాళనకు ముహూర్తం సిద్ధం చేశారు.. ఇది అక్కడితో ఆగేలా లేదు. కొత్త మంత్రులతోనే ఈ కొత్త జిల్లాలకు వెళ్లనున్నట్టుగా కూడా వైసీపీ అంతర్గత వర్గాలు చెప్పుకుంటున్నాయి.. అక్కడితోనూ ఆగకుండా పార్టీలో కూడా మార్పులు చేసి జనంలోకి వెళ్లాలనేది కూడా సీఎం ఆలోచనగా చెప్పుకుంటున్నారు..!

YS Jagan: మూడు అడుగులు.. మూడు మార్పులు..!?

సీఎం జగన్ మదిలో ఉన్న ఆలోచనల ప్రకారం చూస్తే ఉగాది నాటికి కొత్త జిల్లాల నుండి పరిపాలన మొదలవుతుంది. తాత్కాలికంగా వేరే భవనాలు అద్దెకు తీసుకుని.. కలెక్టర్ కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలు సహా జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అందుకు అవసరమైన ప్రాధమిక నిధిని ప్రభుత్వం సమకూరుస్తుంది. నెమ్మదిగా వచ్చే సంక్రాంతి నాటికీ ఆయా జిల్లాల్లో పూర్తిస్థాయిలో వసతుల కల్పన, పూర్తిస్తాయిలో పరిపాలన సౌకర్యాలు ఏర్పాటు.., శాశ్వత భవనాల దిశగా ప్రణాళికలు వేస్తున్నారు. సో.. ఏది ఏమైనా ఉగాది నుండి కొత్తా జిల్లాలు రాక ఖాయమే. అయితే ప్రాధమికంగా నిర్ధారించిన 26 జిల్లాలు కాకుండా 30 జిల్లాలు చేయబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. “కొత్తాగా ఏర్పాటు చేయనున్న జిల్లా కేంద్రానికి 75 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశించడం.. అనేక ప్రాంతాల్లో జిల్లా ఏర్పాటు ఉద్యమాలు జరుగుతుండడంతో కొన్ని మార్పులు మాత్రం చేయనున్నట్టు తెలుస్తుంది..!

YS Jagan: CM Planning Grand New Ugadi 2022..
YS Jagan: CM Planning Grand New Ugadi 2022..

* ఇక ఉగాది నాటికీ జిల్లాల విభజన మాత్రమే కాకుండా మంత్రి వర్గ ప్రక్షాళన కూడా చేసెయ్యాలన్నది సీఎం జగన్ ఆలోచనగా తెలుస్తుంది. కొత్త మంత్రులతోనే.. కొత్త జిల్లాల్లో పాలన మొదలు పెట్టించాలని సీఎం జగన్ భావిస్తున్నారట.. అందుకే ఇప్పటికే మంత్రి వర్గ ప్రక్షాళనకు సంబందించిన ఫైళ్లు.. మంత్రుల పనితీరు నివేదికలు.. మంత్రి పదవులు ఆశిస్తున్న.. (తను పదవి ఇవ్వాలి అనుకుంటున్న) ఎమ్మెల్యేలపై సీక్రెట్ ఇంటెలీజెన్స్ నివేదికలు అన్నీ తన టేబుల్ పైకి వచ్చేశాయట.. వాటిని ఒక బృందం సీరియస్ గా అధ్యయనం చేస్తుంది. వాటి ఆధారంగా ఈ నెలాఖరుకి ఒక స్పష్టతకు రానున్నట్టు తెలుస్తుంది. మార్చి మొదటి వారంలో ఆయా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి, పిలిపించనున్నట్టు వైసీపీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి.. సో.. అటు కొత్త జిల్లాలు, ఇటు కొత్త మంత్రులతో కొత్తా పాలనకు జగన్ వెళ్ళబోతున్నట్టు గ్రహించవచ్చు.. అక్కడితో ఆగలేదు..!

YS Jagan: CM Planning Grand New Ugadi 2022..
YS Jagan: CM Planning Grand New Ugadi 2022..

* ఇప్పుడున్న మంత్రులని తీసేస్తే.. ఖాళీగా ఉంచే ఆలోచనలో జగన్ లేరు.. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో తనకు అత్యంత సన్నిహితులు.., పార్టీకి అత్యంత కీలక నేతలు ఉన్నారు.. సో.., వారికి పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వడానికి జగన్ యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మాజీలవ్వబోతున్న మంత్రుల్లో ఒక పది మందిని “పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ” గా ఏర్పాటు చేసి.. వారి ద్వారా రానున్న రెండేళ్లు జిల్లాలు, నియోజకవర్గాల వారిగా పార్టీగా తీరు తెన్నులు, ఎమ్మెల్యేల వ్యవహారశైలి, కార్యకర్తల అసంతృప్తులు.. నామినేటెడ్ పదవులు వంటి కీలక అంశాలను పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ మార్పులు, ఎమ్మెల్యేలతో ముఖాముఖి.., సమస్యలు తెలుసుకోవడం.., వచ్చే ఎన్నికల నాటికి పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం.. ఎక్కడైనా అసమ్మతులు ఉంటె పోగొట్టడం వంటి కీలక బాధ్యతలను ఆ కమిటీ చూసుకోబోతున్నట్టుగా సమాచారం.. అదే సందర్భంలో జిల్లాలకు ప్రస్తుతం ఉన్న పార్టీలను కూడా మార్చేయబోతున్నట్టు తెలుస్తుంది.. సో.. ఈ మూడు రకాల ప్రక్షాళనలతో జగన్ 2022 ఉగాదికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం..!

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N