టాటా నుంచి ఏ కారు వచ్చినా అది ప్రత్యేకమే..! కస్టమర్లకు అనుగుణంగా వారి డిజైన్లు, ఫీచర్లు ఉంటాయి .. ఎంతో కాలం నుండి వాహన ప్రియులు ఎదురు చూస్తున్నా టాటా ఆల్ట్రాజ్ టర్బో వేరియంట్ 13 జనవరి 2021 న విడుదల కానుంది..! అంతేకాకుండా అదిరిపోయే మరీనా బ్లూ కలర్ లో కనువిందు చేయనుంది..! టర్బో వేరియంట్ లోని ఇంజన్ ఆప్షన్లు, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి..
ఇంజిన్ ఆప్షన్లు :
టాటా ఆల్ట్రాజ్ టర్బో వేరియంట్ మూడు ఇంజన్ ఆప్షన్లతో లభించనుంది. 1.5 లీటర్ టర్బో ఫోర్ సిలిండర్ టర్బో చార్జర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 89 బి హెచ్ పి పవర్ ను 200 ఎమ్ఎన్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 1.2 లీటర్ ఫ్రీ సిలిండర్ నేచురల్లీ నాచురల్ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్పి శక్తిని 113 ఎమ్ఎన్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5- స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ గేర్ బాక్స్ ఆప్షన్లలో లభిస్తున్నాయి.1.2 లీడర్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 108బి హెచ్ పి పవర్ ను 140 ఎమ్ఎన్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6- స్పీడ్ మ్యాన్యువల్, డి సిటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ తో వస్తుంది.
ఫీచర్లు:
సెమి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఫ్లాట్ స్టీరింగ్ వీల్, మౌంటెడ్ కంట్రోల్, 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి డిఆర్ఎల్ లు , ఎల్ఈడి లైట్స్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.దీని ఎక్స్ షోరూం ధర రూ. 5-9లక్షల మధ్యలో ఉన్నాయి. హుందాయ్ i20, ఫోక్స్‌వ్యాగన్ పోలో టీఎస్ఐ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా నిలవనుంది.