NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Medigadda Barrage: డ్యామ్ సెఫ్టీ యాక్ట్ 2021 లోని సెక్షన్ 41 బీ ఏమి చెబుతోంది.. శిక్ష ఏమిటి.. ఎవరిని శిక్షించవచ్చు ..?

Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన ఘటన తెలంగాణలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై సంచలన విషయాలతో నివేదిక ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఈ ఘటన జరగడం అధికార బీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వ వైఫల్యం అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

బ్యారేజ్ పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతో పిల్లర్స్ సపోర్టు బలహీనపడిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పింది. పౌండేషన్ మెటీరియల్ పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉందని, పిల్లర్లు కుంగిపోవడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని నివేదికలో స్పష్టం చేసింది. ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ, మెయింటెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సంచలన కామెంట్స్ చేసింది. బ్యారేజీ ప్లానింగ్ కు డిజైన్ కు తేడా ఉందని, బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని భావిస్తున్నామని పేర్కొంది.

గత నెల 23న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆరుగురు నిణుపులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించింది. రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. అనంతరం ఢిల్లీకి వెళ్లిన ఈ కమిటీ తాజాగా 43 పేజీలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

ఈ కమిటీ ఇచ్చిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తొందని పేర్కొనడం గమనార్హం. బ్యారేజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వినియోగానికి పనికిరాదని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ తేల్చి చెప్పింది. పూర్తి స్థాయిలో పునరుద్దరించాల్సి ఉందని స్పష్టం చేసింది. బ్యారేజ్ వైఫల్యాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాల్సి ఉందని నివేదికలో తెలిపింది.

మేడిగడ్డ విషయంలో వర్షాకాలానికి ముందు, తర్వాత కఛ్చితంగా తనిఖీలు చేయాలని జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ తరచు తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కు చెప్పినట్లు నివేదికలో ఉందనీ, కానీ తనిఖీలు చేసినట్లుగా లేదని, ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 లోని చాప్టర్ 10 సెక్షన్ 41(బీ) ని ఉల్లంఘించడమే అవుతుందని అంటున్నారు. అంతే కాకుండా యాక్ట్ లోని చాలా విషయాలు పాటించినట్లుగా కనిపించలేదని, బ్యారేజ్ భద్రత, ఆర్ధిక పరమైన అంశాలను పట్టించుకోకుండా వ్యవహరించడం చాలా సీరియస్ గా చూడాలని కమిటీ పేర్కొంది.

డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 లోని చాప్టర్ 10 సెక్షన్ 41(బీ) ని కమిటీ ప్రధానంగా ప్రస్తావించడం సంచలనం అయ్యింది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర పరిధిలోని డ్యామ్ సెఫ్టీ ఆర్గనైజేషన్ లేదా జాతీయ డ్యామ్ సెఫ్టీ ఆధారిటీ నిబంధనలు పాటించకుండా ఏదైనా డ్యామ్ భద్రతకు విఘాతం కలిగిస్తే ఏడాది వరకూ జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. డ్యామ్ నిర్వహకులపై ఈ విధమైన చర్యలు తీసుకునేందుకు చట్టం వీలు కల్పించింది. ఒక వేళ డ్యామ్ భద్రత సరిగా లేక ఎవరైనా చనిపోవడం లేదా ప్రమాదం జరిగితే రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి 20 అంశాలపై సమాచారం ఇవ్వాలని జాతీయ డ్యామ్ సేప్టీ కమిటీ రాష్ట్ర నీటి పారుదల శాఖను కోరితే అందులో కేవలం 11 అంశాలకు సంబంధించి సమాచారం మాత్రమే ఇచ్చినట్లుగా కమిటీ తన నివేదికలో తెలిపింది. తెలంగాణ నీటి పారుదల శాఖ ఆ తొమ్మిది అంశాలకు సంబంధించి సమాచారం వారి వద్ద లేక ఇవ్వలేదా.. లేక కావాలనే దాచి పెట్టారా.. అనే విషయాలు తెలియరాలేదు. సమాచారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండి కూడా ఇవ్వకపోతే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునే వీలు ఉంటుందని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

Pawan Kalyan: చంద్రబాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్ .. లోకేష్ తో సుదీర్ఘ భేటీ

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N