Tenth Exams: పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. వాట్సాప్ లో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం కావడం తీవ్ర సంచలనం అయ్యింది. వికారాబాద్ జిల్లా తాండూర్ లో పదో తరగతి ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9.37 గంటలకు ప్రశ్నాపత్రం లీక్ కావడం సంచలనం అయ్యింది. అయితే వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి మాత్రం తమ జిల్లా పరిధిలో ప్రశ్నాపత్రం లీక్ కాలేదని తొలుత తెలియజేశారు. తొలి రోజు తెలుగు పరీక్ష జరుగుతుంది. దాదాపు అయిదు లక్షల మంది విద్యార్ధులు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు హజరైయ్యారు.

అయితే సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం లీకేజీ కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాండూరులోని ఒక వాట్సాప్ గ్రూపులో ఈ ప్రశ్నాపత్రం కనిపించింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇది వెంటనే గ్రూపులో పెట్టిన వ్యక్తి డిలీట్ చేసినా ప్రశ్నాపత్రం మాత్రం వైరల్ అయ్యింది. విచారణ జరిపిన అధికారులు ప్రాధమిక విచారణ అనంతరం ఈ ఘటనలో ముగ్గురుని సస్పెండ్ చేశారు. తాండూరు పరీక్షా కేంద్రం సూపర్నిటెండెంట్, ఇన్విజిలేటర్, మరొకరిపై వేటు వేశారు. ఇన్విజిలేటర్ బందప్ప మీద గతంలోనూ ఆరోపణలు ఉన్నాయనీ, 2017 లో పోక్సో కేసు ఉందని తెలుస్తొంది.
YSRCP: అంతా ఉత్తుత్తి ప్రచారమే .. తేల్చేసిన సీఎం వైఎస్ జగన్