ఏ మతమైన తమ ప్రార్థన మందిరాలను చాలా పవిత్రంగా చూస్తాయి. కనీసం చెప్పులను కూడా వేసుకుని రానివరు. అంత భక్తి పారవశంతో చూసుకుంటారు ఆ స్థలాలను. ప్రార్థన మందిరాలు కేవలం వారికి ఇష్టమైన దేవుడు ఉండే చోటు మాత్రమే కాదు. వారిని కంటికి రెప్పలా కాపాడే ఓ శక్తి ఉన్న చోటులా భావిస్తుంటారు. అప్పుడప్పుడు జరిగే కొన్ని తప్పిదాల వల్ల ఆ మతస్తులు బాధ పడుతుంటారు. ఎందుకంటే అవి కావాలని చేసినవి కావు కాబట్టి.
ముస్లింలు అత్యంత పవిత్రంగా చూసే మక్కా మసీదులోకి ఒక కారు దూసుకురావడంతో అందరిని కలవర పెట్టింది. ఈ ఘటన సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మసీదులో చోటు చేసుకుంది. అదుపు తప్పిన ఒక కారు అక్కడి కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి 10.25 గంటలకు మసీదులోకి దూసుకోచ్చింది. ప్రాంగణంలో రక్షణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను గట్టిగా గుద్దుకుంటూ మసీదు గోడను ఢీకొట్టేసింది. భద్రత సిబ్బంది త్వరగా అక్కడికి వచ్చి డ్రైవర్ ను రక్షించారు.
అయితే ఆ కారును నడిపిన డ్రైవర్ పేరును ఆఫీసర్లు ప్రకటించలేదు. కానీ అతను సౌదీ పౌరుడే అని తెలిపారు. అతని మానసిక స్థితి బాగోలేదని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా వల్ల ఏడు నెలల తర్వాత ఈ మక్కా మసీదు తెరుచుకుంది. దీంతో స్థానికంగా 15వేల మందికి మసీదు సందర్శనకు అవకాశం ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. అలాగే అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలుపుతున్నారు.