Salman Khan: బాలీవుడ్ ఇండస్ట్రీ లో సౌత్ ఇండస్ట్రీకి చెందిన అత్యధిక సినిమాలను రీమేక్ చేసి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఏకైక హీరో సల్మాన్ ఖాన్. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫస్ట్ లో ఓ వెలుగు వెలిగిన సల్మాన్ ఒకానొక దశలో ఇండస్ట్రీ నుండి దుకాణం సరిచేసుకునే పరిస్థితి ఉన్న టైంలో తెలుగులో మహేష్ బాబు నటించిన పోకిరి హిందీ లో వాంటెడ్ గా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయం సాధించారు. ఆ తర్వాత అనేక సినిమాలను రీమేక్ చేసినా సల్మాన్ రవితేజ నటించిన కిక్కు సినిమా కూడా హిందీలో రీమేక్ చేసి విజయం సాధించడం జరిగింది. ఇదిలా ఉంటే మరో సారి రవితేజ సినిమా ని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారట.
మేటర్ లోకి వెళ్తా ఇంకా సెట్స్ మీద ఉన్న “కిలాడి” సినిమా.. హిందీలో రీమేక్ చేయాలని సల్మాన్ ఖాన్ డిసైడ్ అయ్యారట. తెలుగులో ఈ సినిమాని రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో పెన్ స్టూడియోస్ ఈ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసి సల్మాన్ చేత హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సౌత్ డైరెక్టర్ల పై సల్మాన్ ఖాన్ కి బాగా నమ్మకం ఉండటంతో ఈ సినిమాని తెలుగులో డైరెక్ట్ చేసిన రమేష్ వర్మ చేతనే హిందీలో కూడా డైరెక్షన్ చేయించి ఆలోచనలో పెన్ స్టూడియోస్ ఉన్నట్లు సమాచారం.
Read More: Ravi Teja: మంచి స్పీడ్ మీద ఉన్న మాస్ రాజా రవితేజ..!!
ప్రస్తుతం తెలుగులో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. సినిమా థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే.. ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తెలుగులో సినిమా రిలీజ్ అవ్వకుండానే సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు సినిమా పై మోజు పడటంతో ఈ సినిమా స్టోరీ ఏంటి అన్నదానిపై మూవీ లవర్స్ కి ఆసక్తి నెలకొంది.