Viral Video : అసలే ఎండాకాలం.. ఎండలు మండిపోతున్నాయి.. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు.. భానుడి భగభగ లకు జనాలు విలవిలలాడిపోతున్నారు.. ఎండా తీవ్రతకు చెమట్లు కక్కుతున్నారు.. మరి పక్షుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎండాకాలం తిండికి, తాగునీటి కోసం పక్షులు ఇబ్బంది పడుతున్నాయి.. కనీసం తాగటానికి నీళ్లు దొరక్క పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి.. ఈ విషయం గ్రహించిన ఈ బుడతడు ఒక పక్షికి నీళ్లు తాపించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది..

ఎండకు సొమ్మసిల్లి దాహంతో పరితపిస్తోన్న ఓ పావురానికి గరిటె తో దాహార్తిని తీర్చాడు ఓ చిన్నపిల్లాడు.. ఎండ దెబ్బ కు సొమ్మసిల్లి రేకు పై ఉన్న పావురానికి కిటికీ గ్రిల్ లో నుంచి గరిటె తో నీళ్లు పోసి ఆ పావురాయి ప్రాణం కాపాడాడు.. ఈ వీడియో సోషల్ మీడియా లో హల చల్ చేస్తోంది.. మానవత్వం చూపిన ఈ చిన్నోడి పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. మనం కూడా పక్షులను, పర్యావరణాన్ని కాపాడటానికి మనవంతు ప్రయత్నం చేయాలి.. సో.. మీ ఇంటి ముందో, ఆరు బయట, మీ పొలం వద్దనో, ఏ చెట్టుకో , తీగకో పక్షుల కోసం కాసిన్ని నీళ్లు చిన్న పాత్రలో పెట్టి ఉంచండి.. పక్షుల ప్రాణాలు కాపాడండి..