Vakeel Saab : పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మువీ విడుదల రోజే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. మూడు సంవత్సరాల తరువాత పవన్ వెండి తెరపైకి కనిపిస్తుండటంతో అందరిలో చాలా ఉత్సాహం నెలకొని ఉంది. అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా ధియేటర్ కు వచ్చి మరీ వకీల్ సాబ్ మువీని వీక్షించారు.
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తల్లి అఁజనాదేవి, సోదరి, వరుణ్ తేజ్, సాయి తేజ్, నాగబాబు తదితర ఫ్యామిలీ మెంబర్స్ నేడు హైదరాబాద్ లోని ఏఎంబీ మల్టీప్లెక్స్ ధియేటర్ లో వకీల్ సాబ్ మువీ చూశారు. వారు మువీ చూస్తున్న ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమ్మతో పాటు అందరం వకీల్ సాబ్ ధియేటర్ లో అంటూ క్యాప్షన్ జత చేస్తూ షో టైమ్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు చిరు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!