NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

Apoorva Srinivasan: ఇటీవల సినీ తారలు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. తమ సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డు వేసి మింగిల్ అయిపోతున్నారు. ఇటీవలె రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ పన్ను వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తాప్సీ అత్యంత రహస్యంగా తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. కనీసం పెళ్లి ఫోటోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడింది. తాజాగా మరో టాలీవుడ్ బ్యూటీ గ‌ప్‌చుప్ గా పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ నటి అపూర్వ శ్రీనివాసన్ ఓ ఇంటిది అయ్యింది.

అపూర్వ శ్రీ‌నివాస‌న్ మ‌న తెలుగు అమ్మాయే. హైదరాబాద్ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ కాంటెస్ట్‌లో విజేత‌గా నిలిచిన అపూర్వ.. టెంప‌ర్ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించారు. ఇందులో విల‌న్ల చేతిలో లైంగిక దాడికి గురై చ‌నిపోయిన దీప్తి పాత్ర‌లో అపూర్ణ శ్రీ‌నివాస‌న్ న‌టించి మెప్పించింది. 2015లో విడుద‌లైన టెంప‌ర్ మూవీ భారీ విజ‌యాన్ని అందుకుంది.

ఆ సినిమా అనంత‌రం అపూర్వ శ్రీ‌నివాస‌న్ తెలుగులో జ్యోతి లక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, విన్న‌ర్‌, తొలి ప్రేమ‌, క‌వ‌చం, ప్రేమ కథా చిత్రం 2, అయోగ్య త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. అలాగే జీ5 లో చిత్రం విచిత్రం అనే వెబ్ సిరీస్‌లో న‌టించి డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చింది. 2019లో రంధవా మూవీతో క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టింది. అయితే ఎంతో టాలెంట్ ఉన్నా కూడా అపూర్వ కేవ‌లం స‌హాయ‌క పాత్ర‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయింది.

ఈ క్ర‌మంలోనే 2022 నుంచి వెండితెర‌కు దూరంగా ఉన్న‌ అపూర్వ శ్రీ‌నివాస‌న్ పైలట్ అయింది. ప్ర‌స్తుతం పైల‌ట్ గా ఉద్యోగం చేస్తూ స‌త్తా చాటుతోంది. ఇక‌పోతే తాజాగా అపూర్వ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. శ్రేయాస్ శివకుమార్ అనే వ్యక్తితో క‌లిసి ఏడ‌డుగులు వేసింది. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. సినీ ప‌రిశ్ర‌మ నుంచి హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాత్ర‌మే ఆమె వివాహానికి హాజ‌రు అయింది. ప్ర‌స్తుతం అపూర్వ శ్రీ‌నివాస‌న్ వెడ్డింగ్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. దీంతో నెటిజ‌న్లు మ‌రియు సినీ ప్రియులు శ్రేయాస్ శివకుమార్ మ‌రియు అపూర్వ దంప‌తుల‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri