Top 10 Tollywood Heroes: సినీ పరిశ్రమలో తమ హీరో నెంబర్ వన్ అంటే.. తమ హీరో నెంబర్ వన్ అని అభిమానులు ఎప్పటికప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఈ నెంబర్ల గేమ్ ను హీరోలు పెద్దగా పట్టించుకోకపోయినా.. అభిమానులు మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. టాలీవుడ్ లో చూసుకుంటే ప్రస్తుతం యంగ్ జనరేషన్ హీరోల హవానే ఎక్కువగా నడుస్తోంది. దాదాపు అర డజన్ కు పైగా హీరోలు టాలీవుడ్ టాప్ స్టార్స్ గా సత్తా చాటుతున్నారు. మరి వారిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నది ఎవరు అన్నది తాజాగా వెళ్లడైంది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటికప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ తారలపై, సినిమాలపై సర్వేలు నిర్వహిస్తుంటుందన్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా సినీ లవర్స్ అభిప్రాయాలు సేకరించి టాలీవుడ్ టాప్ 10 హీరోలు ఎవరో తేల్చింది. ఈ మేరకు ఒక జాబితా విడుదల చేసింది. చాలా కాలం నుంచి టాప్-3 లో ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉండేవారు. కానీ తాజా సర్వేలో టాలీవుడ్ హీరోల స్థానాలు తారుమారు అయ్యాయి. టాప్-1 లో మాత్రం ఎప్పటిలాగా ప్రభాసే ఉన్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్.. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ 1గా సత్తా చాటుతున్నాడు. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం మిగతా హీరోలకు పెద్ద సవాల్‌గా మారింది.
ఇక ప్రభాస్ తర్వాత రెండో స్థానాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు ఒక పాన్ ఇండియా మూవీ చేయకపోయినా కూడా మహేష్ బాబు దేశవ్యాప్తంగా భారీ పాపులరిటీ సంపాదించుకుని టాలీవుడ్ లో టాప్ 2 స్థానంలో నిలబడ్డాడు. పుష్ప ది రైస్ తో నేషనల్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మాక్స్ సర్వేలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
అలాగే టాప్ 2లో ఉండాల్సిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాప్ 4లోకి పడిపోయాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరతో పాటు హిందీలో స్ట్రైట్ గా వార్ 2 మూవీ చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐదో స్థానంలో ఉన్నారు. ఈయన కూడా ఆర్ఆర్ఆర్ మూవీతోనే గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గేమ్ ఛేంజర్ తో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు.
సినిమాల కన్నా కూడా రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆర్మాక్స్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఆరో స్థానంలో నిలబడ్డారు. అలాగే ఏడో స్థానంలో న్యాచురల్ స్టార్ నాని, ఎనిమిదో స్థానంలో మాస్ మహారాజా రవితేజ ఉన్నారు. ఇక టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకోగా.. టాప్ 10లో మెగాస్టార్ చిరంజీవి నిలిచారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!