టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా యాక్టింగ్ పై ఉన్న ఫ్యాషన్ తో వరుసగా సినిమాలు చేస్తోంది. నీల్ కిచ్లూ జన్మించిన అనంతరం టాలీవుడ్ లో భగవంత్ కేసరి సినిమాతో గ్రాండ్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు సత్యభామ అనే లేడీ ఓరియంటల్ మూవీతో అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంతో సుమన్ చిక్కాల దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అలాగే మేజర్, గూఢచారి వంటి అద్భుత సినిమాలను తీసిన డైరెక్టర్ శశికిరణ్ తిక్కా సత్యభామ సినిమాకు స్క్రీన్ ప్లే ఇస్తూ ప్రెజెంటర్ గా ఉన్నారు. మరియు బాబి తిక్క, శ్రీనివాస్ రావు తక్కలపెల్లితో కలిసి నిర్మాతగా కూడా వ్యవహరించారు.
క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కాజల్ నటించింది. కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకు చేసిన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో ఆమె అలరించబోతోంది. నవీన్ చంద్ర, నాగినీడు, ప్రకాష్ రాజ్ వంటి నటులు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషించారు. జూన్ 7న సత్యభామ సినిమా అట్టహాసంగా విడుదల కాబోతోంది. టీజర్, ట్రైలర్ ద్వారా ఇప్పటికే ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో కాజల్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.
చాలా పర్సనల్ గా తీసుకుని మరీ ఆమె సత్యభామ మూవీని ప్రమోట్ చేస్తోంది. ఈ సినిమా గురించి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే కాజల్ అగర్వాల్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని బ్యూటీఫుల్ ఫోటోలు పంచుకుంది. బ్లూ కలర్ ట్రెండీ డ్రెస్ లో అందంగా మెరిసిపోతూ ఫోటోలకు ఫోజలు ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా కాజల్ తన చేతికి ధరించిన వాచ్ ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బాలన్ బ్లూ డి కార్టియర్ వాచ్ ను కాజల్ తన చేతికి పెట్టుకుంది. ఈ వాచ్ ఖరీదెంతో తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది. ఎందుకంటే, ఆ వాచ్ ధర అక్షరాల రూ. 14,10,000. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకైపోతున్నారు. ఒక్క వాచ్ కోసం కాజల్ అగర్వాల్ అన్ని లక్షలు ఖర్చు పెట్టిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రూ. 14 లక్షలతో ఒక కారు కొనేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కాజల్ కాస్ట్లీ వాచ్ మాత్రం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.