NewsOrbit
న్యూస్

సినిమా చాన్స్ అంటూ మోసగాడి వల.. లక్షల్లో వసూళ్లు.. ఆపై

cheating youth for movie offers

సినిమాల్లో అవకాశం వస్తే తమ టాలెంట్ నిరూపించేందుకు ఎందరో సిద్ధంగా ఉంటారు. ఇందుకు సరైన దారులు ఎంచుకోకపోతే మొదటికే మోసం రావడం ఖాయం. ఇటువంటి మోసానికే పాల్పడ్డాడు ఓ మోసగాడు. కొత్తగా సినిమా తీస్తున్నానని నమ్మించి లక్షల్లో డబ్బులు గుంజాడు. అంతటితో ఆగక అమ్మాయిలను లైంగికంగా వేధించడంతో అతడి ఆగడాలకు అడ్డుకట్ట పడింది.

cheating youth for movie offers
cheating youth for movie offers

 

రావణ భిక్షు అనే వ్యక్తి తనను తాను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కెమెరామెన్ గా పని చేసినట్టు చెప్పుకున్నాడు. కొత్తగా సినిమా తీస్తున్నాను.. నటీనటులు కావాలి అని ప్రకటన ఇచ్చాడు. ఇది నమ్మి ఎందరో ఔత్సాహికులు, నటనపై ఆసక్తి ఉన్నవారు భిక్షును కలిశారు. చైతన్య ఆర్ట్స్ పేరుతో బ్యానర్ పై ‘ఆత్రేయపురం ప్రేమకథ’ అనే సినిమా తీస్తున్నట్టు నమ్మించాడు. త్వరలో అమరావతి శైవ క్షేత్రంలో షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపాడు. ఇందుకు వారి వద్ద నుంచి 30వేల నుంచి వారి స్థోమతను బట్టి డబ్బు వసూలు చేశాడు.

 

జబర్దస్త్ పేరు చెప్పటంతో నిజమేనని నమ్మి అడిగినంత ఇచ్చారు. వీరిలో అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే.. అమ్మాయిలను లైంగికంగా వేధించడంతో ఇదంతా మోసమని గ్రహించారు. వెంటనే పోలీసులను, మీడియాను సంప్రదించి మోసాన్ని బయటపెట్టారు. భిక్షు మోసానికి బలైపోయిన వారిలో ఎక్కువగా విజయవాడ – గుంటూరుకు చెందిన వారే ఉండటం విశేషం. రంగంలోకి దిగిన పోలీసులు రావణ భిక్షును అరెస్టు చేసి విచారణ చేపట్టారు. జబర్దస్త్ కార్యక్రమంలో భిక్షుకు సంబంధాలున్నాయా.. ఎక్కడైనా మోసాలకు పాల్పడ్డాడా, ఎంతెంత వసలూ చేశాడు.. అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

 

 

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !