NewsOrbit
రాజ‌కీయాలు

ఈ కేసులో జగన్ తప్పు లేకుండానే హైకోర్టులో స్ట్రాంగ్ మొట్టికాయ !

ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. జడ్జి రామకృష్ణతో ఆయ‌న సంభాష‌ణ‌లు అనంత‌రం ప‌రిణామాలు తెలిసిన సంగ‌తే.

ఇందుకు సంబంధించిన ఆడియో టేప్‌ను వైర‌ల్ అవ‌డం, ఈ వ్యవహారంపై ఈశ్వరయ్య ఎట్టకేలకు స్పందించి మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చిన ఉదంతం తెలిసిందే. అయితే, త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేయ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.

మాజీ జడ్జి ఈశ్వరయ్య కేసులో హైకోర్టు స్పందన ఏంట‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. రిటైర్డ్ న్యాయమూర్తి ఈశ్వరయ్య కేసులపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణకు హైకోర్టు ఆదేశాలు వెలువ‌రించింది. విచారణ అధికారిగా మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్‌ను నియ‌మించింది. రవీంద్రన్‍కు సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు వెలువ‌రించింది. ఈ కేసుల వెనుక ఉన్న కుట్రను చేధించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో నివేదికను అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉండ‌గా జడ్జి రామకృష్ణ చేసిన ఆరోపణలను ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లడంతో గురువారం హైకోర్టు ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిటైర్డ్ జ‌డ్జీ, మ‌రో జ‌డ్జీ ఫోన్ సంభాష‌ణ‌ల ఉదంతంతో సంబంధం లేకుండానే ఏపీ ప్ర‌భుత్వం ఇబ్బందుల పాల‌వుతోంది. మ‌రోవైపు, రిటైర్డ్ జ‌స్టిస్‌ ఈశ్వరయ్యతో ప్రభుత్వం రాజీనామా చేయిస్తుందా? అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

Related posts

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju