NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

కృష్ణపట్నం పోర్టులో ఆదానీ గ్రూపు వాటా..!!

ప్రముఖ సంస్థ ఆదానీ గ్రూపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నది. ఇప్పటికే రాజస్థాన్ పవర్ కంపెనీ, జివికె నుండి ముంబాయి ఏయిర్ పోర్టును హస్తగతం చేసుకున్న ఆదానీ గ్రూపు తాజాగా ఏపి ప్రభుత్వం నిర్మిస్తున్న కృష్ణపట్నం పోర్ట్ కాంట్రాక్ట్ ను దక్కించుకున్నది. నెలన్నర తరువాత కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూపునకు కృష్ణపట్నం పోర్టు కాంట్రాక్ట్ ఇచ్చిందని ఏపి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు, దీంతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూడా ఇందుకు సీల్ అప్రూవల్ ఇచ్చింది.

 

Krishna patnam port

మొత్తం 13,572 కోట్ల రూపాయల డీల్ ను ఆదాని కుదుర్చుకున్నది. కృష్ణపట్నం పోర్టులో ఆదానీ పోర్ట్స్ అండ్ స్పేషల్ ఎనకమిక్ జోన్ లిమిటెడ్ (ఏపిఎస్ఇజడ్) సంస్థకు 75 శాతం వాాటాను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కృష్ణ పట్నం పోర్టు బాధ్యతలు ఆదానీ గ్రుపునకు కేటాయిస్తూ ఎన్ ఒ సి ఇచ్చినట్లు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. ఈ పోర్టును 2009లో 30 ఏళ్ల లీజుకు హైదరాబాదుకు చెందిన సివిఆర్ కంపెనీకి అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో మెజార్టీ వాటా ఇప్పుడు ఆదానీ గ్రూపు హస్తగతం అయ్యింది.

కృష్ణ పట్నం పోర్టు నెల్లూరు జిల్లా కేంద్రానికి తూర్పుగా 18 కిలో మీటర్ల దూరంలో కృష్ణపట్నం వద్ద ఉంది. ఇది సుమారు 500 ఏళ్ల క్రితమే సహజ ఓడరేవుగా గుర్తింపు పొందింది. ఈ ఓడ రేవును 2008 జూలై 17వ తేదీన యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తదితర ప్రముఖులు లాంఛనంగా ప్రారంభించారు.

బ్రిటీష్ పాలనా కాలంలో చెన్నపట్నం, మచిలీపట్నం ఓడరేవుల నిర్మాణాలతో పాటు అభివృద్ధికి నోచుకోని ఈ కృష్ణపట్నం సహజ ఓడరేవు నేడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఓడరేవు నిర్మాణానికి ఇతర అవసరాలకు 2006 లోనే 6009 ఎకరాల భూమిని సేకరించి నిర్మాణ పనులు చేపట్టారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju